Breaking News

ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో అన్ని ప్రాంతాలకు త్రాగు నీరు సరఫరా చేయాలని నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం నగర శివారు ప్రాంతాలు, అభివద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలలో ప్రజల త్రాగు నీటి అవసరాలను తీర్చాలని ప్రతి ఇంటికి త్రాగు నీరు సరఫరా చేయాలని సంబంధిత అధికారులతో కలిసి మారుమూల ప్రాంతాలలో పర్యటించారు.

గత రెండు రోజులుగా వాటర్‌ పైప్‌ లైన్‌ లీకేజీ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషన్‌ జితేష్‌.వి.పాటిల్‌ గారు, పబ్లిక్‌ హెల్త్‌ ఇఇ మురళి మనోహర్‌ రెడ్డి, డిప్యూటీ ఇఇ ఆనంద్‌ సాగర్‌, డిఇ ముస్తాక్‌ అహ్మద్‌, ఏ.ఇ. వాజిద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article