Breaking News

నాణ్యత ఉండేలా చూసుకోవాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌, తాడ్కోల్‌, దేశాయిపేట్‌, బీర్కూర్‌ మండలంలోని రైతు నగర్‌, బీర్కూర్‌ భైరాపూర్‌ క్లస్టర్‌ వారీగా రైతులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణ పనులను, పల్లె ప్రకతి వనాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, నిర్మాణంలో నాణ్యత ఉండేలా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మండలాల ఎంపీపీలు దొడ్ల నీరజ వెంకట రామ్‌ రెడ్డి, రఘు, బీర్కూర్‌ మండల పార్టీ ప్రెసిడెంట్‌ వీరేశం, జడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్‌, పాక్స్‌ చైర్మన్‌ పిట్ల శ్రీధర్‌, కొల్లి గాంధీ, ఏఎంసీ చైర్మన్‌ ద్రోణవెళ్లి అశోక్‌, పాత బాలకష్ణ, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు వ్యవసాయ పంచాయత్‌ రాజ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article