Breaking News

Daily Archives: September 12, 2020

ఆరోగ్యం, స్వచ్ఛత కోసమే ఆ నిర్మాణాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల నగరంలోని గౌతమ్‌ నగర్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద, జిజి కాలేజి గ్రౌండ్‌, అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్‌ జిమ్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అర్సపల్లిలో మెటల్‌ రోడ్డు నిర్మాణం, పబ్లిక్‌ టాయిలెట్స్‌, దుబ్బ చౌరస్తాలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిజామాబాద్‌ నగరంలోని పాలీటెక్నిక్‌ కళాశాల మరియు గంగస్థాన్‌ కాలనీల్లో ఒపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, ...

Read More »

ఎస్‌.ఇ.సి.ని కలిసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు వచ్చిన సి. పార్థ సారథిని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ శనివారం మర్యాదపూర్వకంగా ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కలిశారు. అతిథి గృహానికి వచ్చిన పార్థ సారథికి వారు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. మున్సిపల్‌ కమీషనర్‌ జితేష్‌ వి.పాటిల్‌, నిజామాబాద్‌ ఆర్‌డివో రవి, డిపిఓ జయసుధ, జడ్‌పి సీఈఓ గోవింద్‌ నాయక్‌ తదితరులు కూడా ఎస్‌ఇసి ని ...

Read More »

జేసీఐ వారోత్సవాల సందర్భంగా రక్తదానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జేసిఐ ఇందూర్‌ ఆద్వర్యంలో జేసీస్‌ వారోత్సవాల్లో భాగంగా శనివారం నిజామాబాదు రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసిఐ ఇందూర్‌ సభ్యులు రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమని ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు. ప్రస్తుత కోవిడ్‌ సమయంలో రక్తదానానికి ప్రజలు ముందుకు రావడం లేదన్నారు. ఫలితంగా ...

Read More »

రైతాంగాన్ని రక్షించండి

బోధన్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఎఐకేఎస్‌సిసి) పిలుపులో భాగంగా శనివారం బోధన్‌ ఆర్డీవో కార్యాలయం ముందు అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఏంఎస్‌) ఆధ్వర్యంలో ధర్నా చేసి, మెమో రండం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఏంఎస్‌ జిల్లా నాయకులు పడాల శంకర్‌ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే మూడు ఆర్డినెన్సులను 14 నుంచి జరుగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో పెట్టి బిల్లులుగా ఆమోదింప జెసే ...

Read More »

పనులు వేగవంతంగా పూర్తిచేయాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బాన్సువాడ నియోజకవర్గం, నస్రుల్లాబాద్‌ మండలంలోని దుర్కి, మిరజాపుర్‌, నస్రుల్లాబాద్‌ మరియు బీర్కూర్‌ మండల కేంద్రంలోని క్లస్టర్‌ వారీగా రైతులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణ పనులను, పల్లె ప్రకతి వనాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఆర్డీవో రాజా గౌడ్‌, భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, నిర్మాణంలో నాణ్యత ఉండేలా ...

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

బాన్సువాడ, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన రెవెన్యూచట్టం అమలు చేయడం పట్ల రాష్ట్ర శాసనసభాపతి స్వగ్రామం పొచారంలో, బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో రైతులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌, స్పీకర్‌ పొచారం శ్రీనివాస్‌ రెడ్డి గార్ల చిత్రపటాలకు తెరాస రాష్ట్ర యువనాయకులు ఉమ్మడి నిజామాబాద్‌ డీసీసీబీ చైర్మెన్‌ పొచారం బాస్కర్‌ రెడ్డి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాత బాలకృష్ణ, పోచారం సర్పంచ్‌ ...

Read More »

నూతన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బీడీ యాజమాన్యాల అసోసియేషన్‌కు కార్మికుల వేతనాల పెంపుదలకు డిమాండ్‌ నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ పాత వేతనాల పెంపుదల ఒప్పందం మే 5వ తారీఖున అయిపోయిందని, మళ్లీ కొత్త వేతన ఒప్పందం ప్రకారం వేతనాలు పెంచాలని కానీ, యాజమాన్యాలు పెంచలేదన్నారు. ఈ విషయమై గతంలో యూనియన్‌ తరపున డిమాండ్‌ నోటీసు ఇచ్చినా స్పందించకపోవడం సరైంది కాదన్నారు. వెంటనే కొత్త ఒప్పందాన్ని ...

Read More »

పెద్దోల్ల గంగారెడ్డిని సన్మానించిన గల్ప్‌ బాధితులు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లో యువజన సంఘాల ఆధ్వర్యంలో గల్ప్‌ బాధితుల సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దోల్ల గంగారెడ్డి గల్ప్‌ బాధితులను ఆదుకున్నందుకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దోల్ల గంగారెడ్డి గల్ప్‌ బాధితుల సమస్యలు తెలుసుకొని కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ గారికి విన్నవించారని, వారి చొరవతో ఇండియన్‌ ఎంబసిస్‌కు సమాచారం అందించి అక్కడున్న తెలంగాణ, జగిత్యాల్‌, ...

Read More »