Breaking News

అక్కడ మద్యం తాగితే కఠిన చర్యలు

జగిత్యాల, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా ఇంచార్జ్‌ ఎస్పీ, కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ వి బి కమలసన్‌ రెడ్డి ఆదేశాలమేరకు రూరల్‌ ఎస్సై సతీష్‌ తమ సిబ్బంది తో కలిసి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్‌, మోతె పరిసర ప్రాంతాల్లో మామిడి తోటల్లో, నర్సింగపూర్‌ పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం తాగుతున్నారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. 30 కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే మందుబాబులు రహస్య ప్రాంతంలో ఎంచుకున్న వాటిని గుర్తిస్తూ బహిరంగంగా మద్యం సేవించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఆదివారం బహిరంగంగా మద్యం సేవిస్తూ దొరికిన వారిని కోర్ట్‌లో హాజరు పరచడం జరుగుతుందని, కేసును బట్టి తీవ్రతను అనుసరించి వారికి శిక్షలు, జరిమానాలు విధిస్తామన్నారు.

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వ్యక్తులు, ప్రదేశాలపై స్థానిక ప్రజల నుండి సమాచారం సేకరించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముఖ్యంగా రాత్రి లైటింగ్‌ తక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి మరింత సమర్ధవంతంగా పెట్రోలింగ్‌ నిర్వహించడం జరుగుతుందని వివరించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని క్రమం తప్పకుండా గుర్తించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారి పట్ల కఠినంగా ఉంటామని ఎస్‌ఐ తెలిపారు.

Check Also

జగిత్యాల నుంచే తెరాస జైత్రయాత్ర

ఎంపి కవిత జగిత్యాల, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల నుంచే టిఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుందని ...

Comment on the article