Breaking News

అక్టోబర్‌ 16న బతుకమ్మ పండుగ ప్రారంభం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌ 16 నుండి 24 వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. బతుకమ్మ పండుగ తేదీలపై మాజీ ఎంపీ కవితను కలసిన ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలోని సిద్ధాంతులు, పండితులు, అధిక ఆశ్వీయుజ మాసం కారణంగా శాస్త్ర ప్రకారం పండుగ తేదీల్లో మార్పుల్ని పండితులు చెప్పారు.

ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్‌ 16 నుండి 24 తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. బతుకమ్మ పండుగ జరుపుకునే తేదీలపై ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులతో కూడిన ‘తెలంగాణ విద్వత్సభ’తో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చర్చించారు. అధిక ఆశ్వీయుజ మాసం కారణంగా శ్రీ శార్వరి నామ సంవత్సరం లో వచ్చే బతుకమ్మ పండుగ తేదీలపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు గాను, ‘తెలంగాణ విద్వత్సభ’ ప్రతినిధులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి, పండుగ తేదీలపై చర్చించారు.

అంతకంటే ముందు ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలోని 32 మంది సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులు, పండుగ తేదీలపై ఆన్‌ లైన్‌ సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణాకే తలమాణికంగా నిలిచిందని మాజీ ఎంపీ కవిత గుర్తు చేశారు. ఈ సంవత్సరం అధిక మాసం రావడం వల్ల పండుగ తేదీలపై కొంత సందేహాలున్నాయన్నారు.

‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలో పండితులంతా చర్చించి ఈ సంవత్సరం పండగ తేదీలను శాస్త్ర ప్రకారం నిర్ణయించారని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ సంవత్సరం అధిక మాసాన్ని పరిగణలోకి తీసుకుని, ప్రతి సంవత్సరం లాగ బాధ్రపద మాసంలో కాకుండా, అశ్వయుజ మాసంలో (అక్టోబర్‌) 16వ తేదీన బతుకమ్మను ప్రారంభించి, తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించాలన్నారు. బాధ్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మను ప్రారంభించాలని కొంతమంది ప్రతిపాదనలు చేశారన్నారు.

‘మొదటి రోజు చేసుకునే గౌరమ్మకు, నెలరోజుల పాటు పూజలు చేసుకుని, అక్టోబర్‌లో వచ్చే దుర్గాష్టమి రోజు వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవచ్చు. అయితే బతుకమ్మను ప్రారంభించి, పూజలు చేయకపోవడం సరైనది కాదని వేదపండితులు తెలిపారన్నారు. తెలంగాణ జాగతి చాలా సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున, చాలా మంది బతుకమ్మ తేదీల గురించి తనను సంప్రదించారని కవిత పేర్కొన్నారు.

దీంతో ‘తెలంగాణ విద్వత్సభ’ సలహా మేరకు అక్టోబర్‌ 16 తేదీన బతుకమ్మ పండుగను ప్రారంభించి, అక్టోబర్‌ 24 తేదీ వరకు తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని, శాస్త్ర ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని వేద పండితులు తెలిపారని కవిత అన్నారు.

పండితులు, సిద్ధాంతుల సూచనల ప్రకారం అక్టోబర్‌ 16 న బతుకమ్మను ప్రారంభించాలని తెలంగాణ ఆడపడుచులను మాజీ ఎంపీ కోరారు. ‘తెలంగాణ విద్వత్సభ’ రాష్ట్ర అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ తెలంగాణ జాగతి రాష్ట్ర యువత ఆద్యక్షులు కొరబోయిన విజయ్‌ కుమార్‌, ఇతర పండితులు, మాజీ ఎంపీ కవితను కలిశారు.

Check Also

తెరాస విజయం ఖాయం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ...

Comment on the article