Breaking News

నిజాంసాగర్‌లో కరోన కేసులు నిల్‌

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 27 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా ఎవరికి కూడా కరోనా పాజిటివ్‌ రాలేదని మండల వైద్యాధికారి రాధా కిషన్‌ తెలిపారు. నిజాంసాగర్‌లో మొత్తం 193 కేసులు కాగా, కోలుకున్నవారు 62 మంది, ఒకరు కరోనాతో మరణించారన్నారు.

కరోనా పాజిటివ్‌ కేసులు కొమలాంచ 2, తుంకిపల్లి 7, గాలి పూర్‌ 4, గునుక్కల్‌ 9, శేర్ఖాన్‌ పల్లి 1,మల్లూర్‌ 9, సింగీతం 7, మగ్దూంపూర్‌ 73, ఆరేపల్లి 10, గిర్ని తాండ 1, కొన తాండ 1, నర్వ 1, మాగి 1, అచ్చంపేట్‌ 2, సుల్తానగర్‌ 1, మల్లూర్‌ తండా 1, మొత్తం 130 ఉన్నాయన్నారు.

నిజాంసాగర్‌ మండల ప్రజలు ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, వంటి లక్షణాలు ఉన్నవారు గ్రామంలోని ఆశా కార్యకర్తలకు తెలియజేసి స్వచ్చందంగా వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్‌ కోరారు. కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. తప్పని పరిస్థితిలో ఇంటి నుంచి బయటకు వస్తే మాస్క్‌ శానిటైజర్‌ ఉపయోగించాలని సూచించారు.

Check Also

కోటగిరిలో కోవిడ్‌ నిబంధనల‌పై అవగాహన

బాన్సువాడ, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రచ్చగల్లి, చావిడి గల్లి, ...

Comment on the article