Breaking News

టి ఐడియా పాలసీలో వాహనాల మంజూరు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టర్‌ ఛాంబర్‌లో టీఎస్‌ ఐ-పాస్‌ డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి. టి ఐడియా పాలసీ క్రింద ఇద్దరికి వికలాంగులు మరియు బీసీ (సి) కోటా క్రింద ట్రాక్టర్‌ అండ్‌ ట్రైలర్‌ వెహికల్‌ మరియు గూడ్స్‌ లైట్‌ మోటార్‌ వెహికల్‌ మంజూరు చేశారు.

అదేవిధంగా టి ప్రైడ్‌ పాలసీ క్రింద 16 మంది ఎస్సీలకు కూడా ట్రాక్టర్లు, గూడ్స్‌ లైట్‌ మోటార్‌ వెహికల్స్‌, కార్లు మంజూరు చేశారు. మంజూరైన వారికి సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ వారికి 35 శాతం, మహిళలకు 10 శాతం ఇవ్వబడుతుందని తెలిపారు. సమావేశంలో డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ సెంటర్‌ జనరల్‌ మేనేజర్‌ బాబురావు, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సుదర్శన్‌, ఎస్‌సి, ఎస్‌టి కార్పొరేషన్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article