Breaking News

రోడ్డు ప్రమాదంలో సర్పంచ్‌కు గాయాలు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం రాత్రి రాజంపేట్‌ మండలం ఆర్గొండ గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌ గారు గ్రామ సమీపంలో బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మండల నాయకులు స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కి సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించి హైదరాబాద్‌లో చికిత్సకై ఆసుపత్రికి వెళ్లి దగ్గరుండి చేర్పించారు.

ఎమ్మెల్యే అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందివ్వాలని కోరారు. అలాగే వారి కుటుంభ సభ్యులకు ధైర్యం చెప్పి త్వరలోనే కోలుకోవడానికై అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article