Breaking News

అందరి సహకారంతో మొదటి స్థానం రావడానికి కృషి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్‌, పల్లె ప్రకతి వనాల పనులు పరిశీలించటానికి దర్పల్లి మండలంలో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్పల్లి మండలంలో పల్లె ప్రకతి వనం హెడ్‌ క్వార్టర్లో ఉన్నందుకు అభినందించారు. ఇలా ప్రతి మండలంలో ఉండాలన్నారు.

గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మొక్కలు మంచిగా కనబడుతున్నవని, ఇది మన బావి తరాలకు మనం ఇస్తున్న వరమని, ప్రతి గ్రామము పచ్చగా ఉండాలని, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ను ఎలా వాడుకోవాలి, తద్వారా గ్రామం ఎలా అభివద్ధి చెందుతుంది అన్నది ప్రతి సర్పంచ్‌ తెలుసుకోవాలని, గ్రామంలో 365 రోజులు ఉపాధి హామీ పనులు చేసుకోవచ్చునని, గ్రాముంలో లేబర్‌ను ఎంత వాడుకుంటే గ్రామం అంత అభివద్ధి చెందుతుందని, జిల్లాలో మాడల్‌ వైకుంఠ ధామాలు దేశానికి ఆదర్శంగా కావాలన్నారు. కంపోస్ట్‌ షెడ్డు నిర్మాణంలో ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని, గ్రామాలలోని ప్రజాప్రతినిధులు, అధికారులందరి సహకారంతో మొదటి స్థానం రావడానికి ప్రయత్నిస్తామన్నారు.

స్వచ్ఛభారత్‌ మిషన్‌లో డబ్బులు రావాలంటే మీ గ్రామాలలో ఉన్న పరిస్థితులు మారాలని, చెత్త నిర్వహణ మీద దష్టి పెట్టాలన్నారు. చెత్త నిర్వహణలో మండలానికి రెండు గ్రామ పంచాయతీలు సెలెక్షన్‌ చేయడం జరిగిందని, ఆ రెండు గ్రామపంచాయతీలలో పద్దతి ప్రకారం చెత్త నిర్వహణ చేయగలిగితే ఆ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుండి అదనపు ఫండ్‌ వస్తుందని, గ్రామం హెల్త్‌ పరంగా, శానిటేషన్‌ పరంగా ఇంకా చాలా రకాలుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని, హాస్పిటల్‌ ఖర్చులు తగ్గుతాయని, ఆరోగ్యంగా వుంటారని, మండల హెడ్‌ క్వాటర్‌ గ్రామ పంచాయతీ రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉంటుందని, పల్లె ప్రగతి పనుల స్పీడ్‌ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తొందరగా పూర్తి చేయాలని, మండలంలోని గ్రామాలలో ఎక్కడైనా పనులు వెనుకబడినట్లైతే సంబంధించిన ప్రజా ప్రతినిధులు, ఎంపిపి, జెడ్‌పిటిసిలు వారి భుజాన వేసుకుని వారి పరిధిలో ఉన్న గ్రామాలలో పల్లె ప్రగతి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్యాంకర్‌, ట్రాలీ ఇవ్వడం జరిగిందన్నారు. వైకుంఠ ధామాలు గ్రామాలలో పేద వారు చనిపోయినా, ధనికుడు చనిపోయినా గౌరవప్రదంగా వెళ్లేలా ఉండాలని, వైకుంఠధామం పార్కులా మార్చాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని, వైకుంఠ దామం విషయంలో మీ మండలాన్ని ఆదర్శంగా మార్చాలని, ప్రతి వైకుంఠ దామం దగ్గర ఒక్క ఫ్రీజర్‌ ఉండాలని, వైకుంఠ రథం వుండే విధంగా చూడాలని, హరితహారం ప్లాంటేషన్‌ ఎక్కువగా రోడ్లకు ఇరువైపులా పెట్టాలని, వైకుంఠ దామంలో, కంపోస్టు షెడ్‌ దగ్గర మొక్కలు పెట్టి ప్రతి మొక్కను రక్షించుకోవాలని, సుమారు మూడు వేల మంది వన సేవకులు పని చేస్తున్నారని, వారికి రోజుకు 237 రూపాయలు ఇస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజుకు 7 లక్షల రూపాయలు ఇస్తున్నామని, ఏ రోడ్డు చూసినా 5 మీటర్లకు ఒక మొక్క ఉండాలని, వన సేవకులు రెండు గంటలు గ్రామంలో శానిటేషన్‌ పనులు చేయాలని, మిగతా సమయం మొక్కలను పెంచాలని, మొక్కలు పెంచకుంటే సోషల్‌ ఆడిట్లో ఇబ్బంది అవుతుందని, ఏవిన్యూ ప్లాంటేషన్‌ అయితే నాలుగువందల మొక్కలకు ఒకరిని, వైకుంఠధామం కంపోస్ట్‌ షెడ్డులో ఒక్కరిని మొక్కలు పెంచుటకు ఏర్పాటు చేయాలని, ఒకరికి వెయ్యి మొక్కలు అప్పగించాలని, గ్రామాలలో మిషన్‌ భగీరథ వాటర్‌ వచ్చిన గ్రామాలలో త్రాగునీటి బోర్లు వాడరాదని, వాటి విద్యుత్‌ వధా ఖర్చు అవుతుందని గ్రామ పంచాయతీకి అదనపు భారం ఉంటుందని చెప్పారు.

మిషన్‌ భగీరథ నీరు రాని దగ్గర తొందరలోనే మంచి నీరు వచ్చే విధంగా చర్యలు చేపడుతామని చెప్పారు. ప్రతి జిపిలో నల్లాకు ఆన్‌, ఆఫ్‌ బటన్‌ ఉండాలని, నీరు వధా కాకుండా చూడాలని, ఇది మన అందరి బాధ్యత అని, నల్లాల దగ్గర సిమెంట్‌ దిమ్మలు తప్పకుండా ఉండాలని, వాటి దగ్గర మొక్కలు పెట్టాలని, ఎవ్వరైనా పైప్‌ లైన్‌ కానీ, నల్లాలు కానీ చెడగొడుతే వారికి 5 వేల జరిమానా విధించాలన్నారు.

గ్రామంలో జరుగుతున్న ప్రతి పనిని ఆడిట్‌ చేస్తారని, కొన్నిచోట్ల మిషన్‌ భగీరథ వాటర్‌ రావడం లేదని, ప్రతి గ్రామంలో జనాభా లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరికి 100 లీటర్ల మిషన్‌ భగీరథ నీరు ఇవ్వాలని, నీరు రాని దగ్గర బోర్‌ వాడాలని, మిషన్‌ భగీరథ ద్వారా నీరు వచ్చినా రాకున్నా పవర్‌ బిల్‌ జిపి నుండీ కట్టాలని, గ్రామంలో ట్యాంక్‌ను నెలకు 3 సార్లు కడగాలని, తప్పకుండా ప్రతి ట్యాంక్‌ను క్లోరినేషన్‌ చేయాలని, ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నదని, ప్రతి గ్రామం ఒక్క మోడల్‌ జిపిగా ఉండాలని, ప్రతి జిపిలో టాక్స్‌లు 100 శాతం వసూలు కావాలని, గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని, ముందుగా తడి పొడి చెత్తను ప్రతి ఇంట్లో నుండి వేరుచేసి ఇచ్చేలా చూడాలని, 10, 15 ఇండ్లకు ఒక్క మనిషిని అలాట్‌ చేయాలని, వారు ప్రతి రోజు చెత్తను తడి, పొడి వేరు చేసి ఇవ్వనట్లైతే వారికి నోటీస్‌ ఇవ్వాలని, కంపోస్ట్‌ షెడ్‌ పూర్తి అయితే మంచి ఎరువు వస్తుందని, ప్రతి షెడ్‌కు మంచి ఆదాయం వస్తుందని, వాటి దగ్గర మంచి మొక్కలు పెట్టాలని, అదేవిధంగా పల్లె ప్రగతి, రైతు వేదికలు, విల్లేజి పార్కులు అన్ని పూర్తి కావాలన్నారు.

కార్యక్రమంలో నిజామాబాద్‌ ఆర్డీవో రవి, జడ్పీటీసీ జగన్‌, ఎమ్మార్వో, ఎంపిడివో, ఎంపీపీ, ఎంపిటిసి, సర్పంచ్‌, ప్యాక్స్‌ చైర్మన్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article