Breaking News

ఫ్రంట్‌ వారియర్స్‌కు సన్మానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపద్యంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌కు జెసిఐ ఇందూర్‌ ఆద్వర్యంలో మంగళవారం నిజామాబాదులో సన్మానించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎంఓగా పనిచేస్తున్న మార కీర్తిప్రియ, ఫుడ్‌ బ్యాంక్‌ ఫౌండర్‌ నవీన్‌ చంటిలను జేసిఐ సన్మానించింది.

ఈ సందర్భంగా జేసిఐ ఇందూరు కార్యదర్శి, జేసీస్‌ వీక్‌ చైర్మెన్‌ తక్కురి హన్మాండ్లు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ఫ్రంట్‌ వారియర్స్‌ అభినందనీయులన్నారు. జిల్లాలో జేసిఐ వారోత్సవాల సందర్భంగా గత వారం రోజులుగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. వారోత్సవాల చివరి రోజైన మంగళవారం కోవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో సేవలందించిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించామన్నారు.

విపత్కర పరిస్థితుల్లో సేవలందించి పలువురికి ఆదర్శంగా నిలిచారని సన్మానగ్రహీతలను అభినందించారు. కార్యక్రమంలో జేసిఐ ఇందూర్‌ పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్‌, కోశాధికారి జమాల్‌పూర్‌ రాజశేఖర్‌, ఉపాద్యక్షులు పెందోటి చంద్రశేఖర్‌, శేఖర్‌, డాక్టర్‌ అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article