Breaking News

Daily Archives: September 16, 2020

సకాలంలో మందులు పిచికారి చేయాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం జక్కాపూర్‌ గ్రామ శివారులో గల వరి పంటలను ఏఈవో రేణుక పరిశీలించారు. అనంతరం ఏఈవో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి పంటలపై అగ్గి తెగులు, బ్యాక్టీరియాలు రాకుండా ఉండేందుకు సకాలంలో మందులు పిచికారి చేయాలన్నారు. రైతులు వ్యవసాయ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు మందులు పిచికారి చేయడంతో రైతులకు అధిక దిగుబడి వస్తుందన్నారు. సకాలంలో పిచికారి చేయడం వల్ల పంట నష్టం తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బంజా కంసవ్వ, రైతు ...

Read More »

నిజాంసాగర్‌లోకి భారీగా వరద నీరు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ జలాశయంలోకి వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 4 వేల 323 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా కల్హేర్‌, బాచపల్లి, రాంరెడ్డిపేట్‌, నిజాంపేట్‌, శంకరంపేట్‌ తదితర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి ప్రాజెక్ట్‌లోకి స్వల్పంగా చేరుతుందన్నారు. ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతమైన సింగుర్‌ ప్రాజెక్ట్‌ జలాశయంలోకి కురుస్తున్న భారీ వర్షాలకు 15 వేల ...

Read More »

తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్ర లోని తూర్పు ప్రాంతాలలో భారీ వర్షాలు పడి జైక్వాడి మరియు ఇతర అనుబంధ ప్రాజెక్టులకు భారీగా వరద జలాలు వస్తుండటం వల్ల మిగులు జలాలను గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నట్లు మహారాష్ట్ర అధికారులు తెలియజేశారని కనుక నిజామాబాద్‌ జిల్లాలోని గోదావరి నదీ తీర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు నదిలోకి వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ సి ...

Read More »

వర్షాలు కురుస్తున్నాయి… ముందస్తు చర్యలు తీసుకోండి….

కామరెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి నష్టం జరుగకుండా అన్ని ముదస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌కు తెలిపారు బుధవారం మంత్రి ఫోన్‌ ద్వారా వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి నష్టం జరుగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టరుతో సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా వుండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ...

Read More »

జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

కామరెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్న కంపోస్ట్‌ షెడ్స్‌, పల్లె ప్రకతి వనాలు, వైకుంఠధామాలు, ఫాగింగ్‌ యంత్రాలు రైతు కల్లాలు, మంకీ ఫుడ్‌ కోర్టులు వినియోగంలోనికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పెషల్‌ ఆఫీసర్లు, మండల అభివద్ది మండల పంచాయితీ అధికారులు, ఎపిఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా పల్లె ప్రగతి పనులను మండల వారిగా సమీక్షించారు. పల్లెప్రగతి పనులు పూర్తయిన తర్వాత గ్రామ ...

Read More »

సెట్‌విన్‌లో 50 శాతం ఫీజు రాయితీ

కామరెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా సెట్‌విన్‌ కేంద్రంలో ఈనెల 21వ తేదీ సోమవారం నుంచి 50 శాతం ఫీజు రాయితీతో తరగతులు ప్రారంభిస్తున్నట్టు కో ఆర్డినేటర్‌ ఎం.నాగేశ్వర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా తరగతులు రద్దుచేశామని, ప్రస్తుతం కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు ఆయా కేంద్రాల్లో శిక్షణ ఇస్తామన్నారు. టైలరింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటిషియన్‌, అడ్వాన్సు బ్యూటిషియన్‌, మగ్గం వర్క్స్‌, మెహందీ, ఎం.ఎస్‌.ఆఫీస్‌, డిటిపి, టాలీ తదితర అంశాల్లో ...

Read More »

ఎల్లారెడ్డి ఆర్‌డివోకు అదనపు బాధ్యతలు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్‌డివో నరేందర్‌ సస్పెన్షన్‌ అయిన కారణంగా కామారెడ్డి రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా ఎల్లారెడ్డి ఆర్‌డివో పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

Read More »

24 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత లేకున్నా 18 సంవత్సరాలు నిండినవారు డిగ్రీలో ప్రవేశం పొందేందుకు విద్యార్థుల కోరిక మేరకు ప్రవేశ అర్హత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 22వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండి ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయిన వారు, చదువు మధ్యలో ఆపేసిన వారు, గృహిణిలు, తదితరులు డిగ్రీ ...

Read More »

ఆన్‌లైన్‌ తరగతుల పరిశీలన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జంగంపల్లిలో విద్యార్థులకు రోజు టివిలో వస్తున్న దశ్య మాధ్యమ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీవీలో వస్తున్న టీ షాట్‌ విద్య దూరదర్శన్‌ యాదగిరి సప్తగిరిలల్లో వచ్చే తరగతులను విద్యార్థులు చూస్తున్నారా లేదా అనే విషయాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించి పరిశీలించారు. ఉదయం 10:30 గంటలకు పదవ తరగతికి సంబంధించిన విద్యార్థులు టివిలో వస్తున్న తరగతుల విషయాలను విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. దీనికి ...

Read More »

బిల్లు ఉపసంహరించుకోవాలి

బోధన్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం పార్లమెంట్‌లో రైతాంగానికి నష్టం కలిగించే బిల్లును పెట్టి ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ బోధన్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను అఖిల భారత రైతు కూలీ సంఘం (ఎఐకేఏంఎస్‌) ఆధర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎఐకేఏంఎస్‌ జిల్లా నాయకులు పడాల శంకర్‌ మాట్లాడుతూ దేశంలోని రైతాంగం, కౌలు రైతులు, వ్యసాయ కూలీలు అందరు వ్యతిరేకిస్తున్నా మరో వైపు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా మోడి మొండిగా, నిరంకుశంగా వ్యవహరిస్తూ, బిల్లును ...

Read More »

గర్భిణీలకు పండ్ల పంపిణీ

బోధన్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ బోధన్‌ మండల శాఖ ఆధ్వర్యంలో బోధన్‌ మండలంలోని కల్దుర్కి గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో గర్భిణీలకు పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమానికి మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దోల్ల గంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. బోధన్‌ మండల అధ్యక్షులు పోశెట్టి, మాజీ మండల అధ్యక్షులు అశోక్‌ గౌడ్‌, లచప్ప, కల్దుర్కి, రాంపూర్‌, రాజన్న, మండల ఐటి సెల్‌ కన్వీనర్‌ జ్ఞానేశ్వర్‌, సభ్యుడు ...

Read More »