Breaking News

సెట్‌విన్‌లో 50 శాతం ఫీజు రాయితీ

కామరెడ్డి, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా సెట్‌విన్‌ కేంద్రంలో ఈనెల 21వ తేదీ సోమవారం నుంచి 50 శాతం ఫీజు రాయితీతో తరగతులు ప్రారంభిస్తున్నట్టు కో ఆర్డినేటర్‌ ఎం.నాగేశ్వర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కోవిడ్‌ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా తరగతులు రద్దుచేశామని, ప్రస్తుతం కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు ఆయా కేంద్రాల్లో శిక్షణ ఇస్తామన్నారు. టైలరింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటిషియన్‌, అడ్వాన్సు బ్యూటిషియన్‌, మగ్గం వర్క్స్‌, మెహందీ, ఎం.ఎస్‌.ఆఫీస్‌, డిటిపి, టాలీ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article