Breaking News

వర్షాలు కురుస్తున్నాయి… ముందస్తు చర్యలు తీసుకోండి….

కామరెడ్డి, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి నష్టం జరుగకుండా అన్ని ముదస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌కు తెలిపారు బుధవారం మంత్రి ఫోన్‌ ద్వారా వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి నష్టం జరుగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టరుతో సమీక్షించారు.

ప్రజలు అప్రమత్తంగా వుండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు తీసుకుంటున్న చర్యలపై వివరిస్తూ, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని మూడు డివిజన పరిధిలో అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని, ముఖ్యంగా మహారాష్ట్ర నుండి కౌలాస్‌ ప్రాజెక్టు ద్వారా, కర్ణాటక నుంచి లెండి ప్రాజెక్టు ద్వారా వచ్చే వరద నీరు మంజీరాలో కలుస్తున్నందున జుక్కల్‌, పిట్లం, బిచ్కుంద మదునూర్‌ మండలాలకు సంబంధించి చుట్టు ప్రక్కల గ్రామాలు ముంపునకు గురి కాకుండా, ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

గ్రామ స్థాయిలో టీములను ఏర్పాటు చేయడం జరిగిందని, మట్టి ఇండ్లలో వుండే వారిని ముందస్తుగా హెచ్చరించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రత్యామ్నాయంగా గ్రామాలలోని పాఠశాలల్లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రెవిన్యూ డివిజనల్‌ అధికారిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం, సాయంత్రం అధికారులతో టెలి కాన్ఫరెన్సు ద్వారా పరిస్థితులను సమీక్షించడం జరిగిందని, వర్షాలు, వరద ముంపు తగ్గిపోయేంత వరకు టెలి కాన్ఫరెన్సు ద్వారా పరిస్థితులను సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.

వాగులు, ముంపునకు గురయ్యే ప్రాంతం పట్ల ప్రత్యేక దష్టి సారించాలని, డివిజన్‌, మండల, గ్రామ స్థాయి అధికారులు హెడ్‌ క్వార్టర్స్‌లోనే వుండి గంట గంటకూ నివేదికలు పంపేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లా కలెక్టరేటులో కంట్రోల్‌ రూమ్‌ 7382928649, 7382929350 ఏర్పాటు చేయడం జరిగిందని, సిపిఓ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బంది 24 గంటలు మానిటరింగ్‌ చేస్తారని, ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు.

పోలీసు, రెవిన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బంది సమన్వయంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో వుండేలా, జిల్లా అధికారులు హెడ్‌ క్వార్టర్స్‌లోనే వుండాలని ఆదేశాలిచ్చినట్లు, సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు వివరించారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article