Breaking News

గత పాలకులు ప్రకటించకపోవడం శోచనీయం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ 18, 19 వ వార్డు ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. 19వ వార్డు ఇంచార్జ్‌ గటడి నితిన్‌ కుమార్‌, 18వ వార్డులో బూత్‌ అధ్యక్షులు సంతోష్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా పుప్పాల శివరాజ్‌ కుమార్‌, గడ్డం శంకర్‌ హాజరై మాట్లాడారు. సెప్టెంబర్‌ 17 ను అధికారికంగా ప్రకటించాలని గత ఎన్నో సంవత్సరాలనుంచి ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు.

కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ పాలకులు తల వంచి సెప్టెంబర్‌ 17 ను అధికారికంగా ప్రకటించక పోవడం శోచనీయమని, ఇప్పటికైనా టిఆర్‌ఎస్‌ కళ్ళు తెరిచి సెప్టెంబర్‌ 17ను మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాలో ఎలాగైతే అధికారికంగా నిర్వహిస్తున్నారో ఇక్కడ కూడా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో రాపెళ్లి సతీష్‌, కోటగిరి వెంకటేశం, ఎర్ర భూమయ్య, బాల గంగాధర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ ...

Comment on the article