Breaking News

ప్లాస్మా దానం అభినందనీయం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపెట్‌ మండలం మోతే గ్రామానికి చెందిన బాల్‌ రెడ్డి అనే 57 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి హైదరాబాదులోని సజన వైద్యశాలలో ఏ పాజిటివ్‌ ప్లాస్మా అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన నాగరాజు సహకారంతో ఏ పాజిటివ్‌ ప్లాస్మాను హైదరాబాద్‌కు వెళ్లి అందజేసి ప్రాణాలు కాపాడినట్టు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత నాలుగు నెలల కాలంలో 250 మందికి రక్తాన్ని మరియు 15 మందికి అవసరమైన ప్లాస్మాను కూడా దాతల సహకారంతో సకాలంలో అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందని కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని, కరోనాకు మందు లేదని ప్లాస్మా ఒకటే ప్రాణాలు కాపాడడానికి మార్గమన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా దానం చేసిన నాగరాజును అభినందించారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article