Breaking News

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరు చేయించారు. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన గుర్రపు సాయిలుకి 1 లక్ష 50 వేలు, జక్రాన్‌ పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్‌కి 13 వేల చెక్కు అందజేశారు.

డిచ్పల్లి మండలం ఘన్పూర్‌ గ్రామానికి చెందిన గంగ మల్లుకి 10 వేలు మండల అధ్యక్షుడు కృష్ణ అందజేశారు. మోపాల్‌ మండలం కాస్బాగ్‌ తండాకు చెందిన పెద్ద చిన్న బలరాంకి 31 వేల 500 చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా ధర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ మాట్లాడారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు రక్షించడం జరుగుతుందన్నారు. ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సెలవుల్లో కూడా పనిచేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హౌస్‌ హోల్డ్‌ సర్వే, పల్లె ప్రకతి వనాలు, రైతు ...

Comment on the article