Breaking News

నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ధర్పల్లి, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, ఓనాజిపేట్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులు నెల ఆఖరి వరకు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా ఓనాజిపేట్‌ గ్రామంలో రైతు వేదికలు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకతి వనం, హరిత హారం పనులు పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు చాలా బాగున్నాయని అభినందిస్తూ ఇక ముందు కూడా ఇలాగే మెయింటైన్‌ చేయాలని, గ్రామంలో కొబ్బరి, పగోడా వంటి పెద్ద మొక్కలు ప్లాంటేషన్‌ చేయాలని, ఎలక్ట్రిక్‌ బోర్ల కింద, లైన్ల కింద పూల మొక్కలు నాటాలని, ఊరి బయటలా ఊరిలో కూడా మొక్కలు నాటాలని సూచించారు. ఉపాధి హామీలో వన సేవకులు రోడ్‌ సైడ్‌ బుష్‌ కటింగ్‌ చేస్తున్న పని పరిశీలించారు.

పారిశుధ్య పనులు, ఉపాధి హామీ పనులపై విచారించారు. రైతు వేదిక పనులు వేగవంతం చేయాలన్నారు. ఎల్‌ఈడి లైట్స్‌, సీలింగ్‌ ఫ్యాన్స్‌ పెట్టాలని, టైల్స్‌ వేయించాలన్నారు. పర్యటనలో కలెక్టర్‌ వెంట సర్పంచ్‌, సెక్రెటరీ తదితరులున్నారు.

Check Also

సెలవుల్లో కూడా పనిచేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హౌస్‌ హోల్డ్‌ సర్వే, పల్లె ప్రకతి వనాలు, రైతు ...

Comment on the article