Breaking News

రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఆర్డినెన్సులు తెచ్చారు

బోధన్‌, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగానికి నష్టం కలిగింగే బిల్లులను పార్లమెంట్‌లో పెట్టి ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా (ఎఐకేఏంఎస్‌) అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కే.రవి మాట్లాడుతూ వ్యవసాయం రాష్ట్రాల పరిదిలోనిదని కాని మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు సంబందం లేకుండా ఆర్డినెన్సులను తెచ్ఛిందని ఆందోళన వ్యక్తం చేశారు.

వాటిని పార్లమెంట్‌లో పెట్టొద్దని, దేశ వ్యాప్తంగా రైతాంగం వ్యతిరేకిస్తూన్నా మోడి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా ఆమోదించారని వాటిని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పొశెట్టి, వీరాస్వామి, ఎస్‌.గంగాధర్‌, మొగులయ్య, బి.శంకర్‌, జే.రాజయ్య, బి.పొశెట్టి, ఒ.నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article