Breaking News

పనుల్లో అలసత్వం వహిస్తే బిల్లులు నిలిపివేస్తాం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కౌలాస్‌ నాలా, నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ పరిశీలించారు. ప్రాజెక్టులోని నీటి సామర్థ్యం వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నీటి పారుదల శాఖ ఈఈ బన్సీలాల్‌, బాన్సువాడ ఆర్‌డిఓ రాజా గౌడ్‌, డిప్యూటీ ఈఈ దత్తాత్రి, ఎ.ఈ.శ్రీనివాస్‌ ప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

అలాగే నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటలో రైతు వేదిక భవన నిర్మాణం పనులను కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనులు చేయడంలో అలసత్వం వహిస్తే బిల్లులు నిలిపి వేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ...

Comment on the article