Breaking News

Daily Archives: September 21, 2020

ఒక వరద గేటు ఎత్తివేత

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో గల కళ్యాణి ప్రాజెక్ట్‌ జలాశయం పూర్తి స్థాయిలో నిండి జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు 300 క్యూసెక్కుల వరద నీరు రావడంతో ఒక వరద గేట్లను ఎత్తి దిగువ మంజీరాలోకి 50 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. కళ్యాణి ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను 409.50 మీటర్ల నీరు నిల్వ ...

Read More »

సింగూరు గలగల

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సింగూరు ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టిఎంసిలుకాగా ఈ నెల 11 వరకు ఉన్న నీరు 3.5 టీఎంసీలే సోమవారంతో ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 18.070 పది రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున వరద ప్రవాహం నమోదైంది. ఈ నెల 12 నుంచి వందల క్యూసెక్కుల ప్రవాహం తో ప్రారంభమైన 18 న 52,384 క్యూసెక్కుల వరకు నమోదైంది. అనంతరం క్రమేణా తగ్గు ముఖం పట్టి సోమవారం సాయంత్రానికి 13,823 ...

Read More »

అక్టోబర్‌ 5 నుండి మాత్రలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 10 వ రౌండ్‌ దివార్మింగ్‌ డే సందర్బంగా అక్టోబరు 5 నుండి 12 వరకు ప్రతి ఒక్క పిల్లవాడికి అల్బెన్దజోల్‌ మాత్రలు వేసే కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని వైద్య, విద్య తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ మరియు అంగన్‌వాడి, ఇంటర్మీడియట్‌ అధికారులు ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నవి కాబట్టి పిల్లలకూ వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ...

Read More »

మౌలిక వసతులు కల్పించాలని ధర్నా

బోధన్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని 12 వ వార్డ్‌ గాంధీ నగర్‌లో నివసిస్తున్న కొన్ని ఇండ్లకు వెళ్లడానికి రోడ్డు లేదని, వీధి దీపాలు లేవని, రాత్రి వేళల్లో చీకటిలో ఏమి వున్నది, లేనిది కనపడదని అంధకారంలో వుంటున్నారని, వారి ఇండ్లకు పోయే రోడ్డుపై పశువుల చర్మాలు కడుగుతారని, దాంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనతో అక్కడ మనుషులు వుండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనేక రోగాల బారిన పడుతున్నామన్నారు. కావున ఆ ఇండ్లకు ...

Read More »

అక్రమ రవాణా చేస్తున్న పిడిఎస్‌ బియ్యం పట్టివేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్కు ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ షాకిర్‌ అలీ తన సిబ్బందితో కలిసి మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దాడులు నిర్వహించి మాణిక్‌ బండార్‌ చౌరస్తా వద్ద 250 క్వింటాళ్ళ పిడిఎస్‌ బియ్యం రవాణా చేస్తున్న 2 ఐచర్‌ వాహనాలను మరియు డ్రైవర్‌ని పట్టుకొని మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

Read More »

టీయూ ఆల్‌ మనాక్‌ ఆవిష్కరణ

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని డిగ్రీ అండ్‌ పీజీ కోర్సులకు చెందిన నూతన విద్యా సంవత్సరం సమయసారిణి సూచిస్తూ ”ఆల్‌ మనాక్‌” లను రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం సోమవారం మధ్యాహ్నం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిగ్రీ, పిజి నూతన విద్యా సంవత్సరం సెప్టెంబర్‌ 1, 2020 వ తేదీ నుంచి జూన్‌ 22, 2021 వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య కనకయ్య, జాయింట్‌ డైరెక్టర్‌ ...

Read More »

కామారెడ్డిలో ఆధునిక మాంసం విక్రయ కేంద్రం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆధునిక మాంసం విక్రయ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ వి. లక్ష్మారెడ్డి అన్నారు. తాడ్వాయి మండలం దేవాయిపల్లిలో గొర్రెలకు, మేకలకు పిపిఆర్‌ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పిపిఆర్‌ టీకాలు ఇస్తున్నామన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గొర్రెల మార్కెట్‌ యార్డ్‌ కోసం రూపాయలు 30 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉపాధి ...

Read More »

ఫోన్‌ ఇన్‌లో 22 ఫిర్యాదులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేటులో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో 22 ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, తీసుకున్న చర్యలపై రిపోర్టు సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ 8, జిల్లా గ్రామీణాభివద్ధి 3, సివిల్‌ సప్లయ్‌ 2 వ్యవసాయం, విద్య, నీటిపారుదల, పశుసంవర్ధక శాఖ, కామారెడ్డి మున్సిపాలిటీ ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు రావడం జరిగింది. ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివద్ధి ...

Read More »

టియు పరిశోధకులకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలలో పిహెచ్‌.డి.చేసే పరిశోధక విద్యార్థులకు కొవిద్‌ -19 నిబంధనలు అనుసరించి డిజిటల్‌ వేదికగా ఆన్‌ లైన్‌ వైవా (మౌకిక పరీక్ష) లు నిర్వహించి డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయడం జరింగిందని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు సోమవారం తెలిపారు. ఈ.వి.ఎల్‌. మాధురికి ఆగస్ట్‌ 21 న ఆచార్య డి.అశోక్‌ పర్యవేక్షణలో ఆర్గానిక్‌ కెమిస్ట్రిలో ”సింథెటిక్‌ స్టడీస్‌ ఆన్‌ న్యూ స్పిరొచ్రోమనోన్‌ అండ్‌ ఈజినల్‌ డెరివేటీవ్స్‌: థెయిర్‌ బయోలాజికల్‌ ...

Read More »

క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున అధికారులందరూ వారి హెడ్‌ క్వార్టర్స్‌ లోనే ఉండాలని, క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా రెవిన్యూ డివిజనల్‌ అధికారులు తహశీల్దార్‌, అధికారులు వర్షాలు, వరదలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మండల వారిగా సమీక్షించారు. ఏ సమయంలో అడిగినా వివరాలు అందించే అధికారులందరూ తమ హెడ్‌ క్వార్టర్స్‌లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి ...

Read More »

మానవత్వం చాటుకున్న టౌన్‌ సిఐ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో టౌన్‌ 4 పిఎస్‌ పరిధిలోని రోటరీ నగర్‌ కాలనికి సంబంధించిన గంగోని బాలమణి (65) ని తన కుమారుడు గత కొన్నిరోజుల నుండి వద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. కాగా కొద్దిరోజుల క్రితం కరోనా సోకడంతో వధాశ్రమము నుండి ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ మధ్య నెగెటివ్‌ రిపోర్ట్‌ రావడం వలన తిరిగి వద్ధాశ్రమానికి పంపగా కరోనా నేపథ్యంలో వృద్ధాశ్రమము మూసివేశారు. కావున సాటివారు బాలమణిని వారి కుమారుని వద్దకు తీసుకుని ...

Read More »

అనారోగ్యంతో ఉంటే ఆ మాత్రలు వేయొద్దు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ, పట్టణ స్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి 1-19 వయస్సు గల పిల్లలకు నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్‌ టాబ్లెట్స్‌ వేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో వైద్య అధికారులు, ఐసిడిఎస్‌, మున్సిపల్‌, విద్యాశాఖ, మెప్మా అధికారులతో వచ్చే అక్టోబరు 5 నుండి 12 వరకు నిర్వహించే 9 వ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యనిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాన్ని తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం చెక్కులు మంజూరు చేశారు. ఇందల్వాయి మండలం లోలం గ్రామానికి చెందిన పోసానికి 18 వేల చెక్కు, చల్లగరిగ గ్రామానికి చెందిన గజానంద్‌కి 57 వేల చెక్కు, సిరికొండ మండలానికి చెందిన అభిషేక్‌కి 60 వేల చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా ధర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి ...

Read More »

శ్మశాన వాటిక స్థలాన్ని రక్షించండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 13 వ డివిజన్‌లో గల సాయిరాం సర్వ సంఘం స్మశాన వాటిక స్థలాన్ని డివిజన్‌ ఎంఐఎం కార్పొరేటర్‌, అతని అనుచరులు భూ కబ్జాకు పాల్పడటంపై బీజేపీ నగర మాజీ అధ్యక్షులు యెండల సుధాకర్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో న్యాయ పరంగా ఈ భూమిని సర్వే చేసి హద్దులతో సహా కేటాయించి కాలనీ సభ్యులకు ...

Read More »