Breaking News

Daily Archives: September 23, 2020

ఆన్‌ లైన్‌ తరగతులకు హాజరుకావాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మొహమ్మద్‌ నగర్‌ గ్రామంలో విద్యార్థుల ఇండ్లను సందర్శించి తరగతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల వర్క్‌ షీట్లను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకటరమణ, ఉపాధ్యాయులు శతి ఉన్నారు.

Read More »

పోషకాహారంతో తల్లి, బిడ్డ క్షేమం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని తుంకిపల్లి అంగన్‌ వాడి కేంద్రంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అధికంగా పోషకాలున్న ఆహార పదార్థాలను అందంగా అలంకరించి అవగాహన కల్పించారు. అనంతరం సర్పంచ్‌ లింగాల వసంత మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌ వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తుందన్నారు. గర్భిణీలు, బాలింతలు చిన్నారులు తప్పక పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని, అలాగే చిన్నారుల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో ...

Read More »

మందుల చట్టం నిబంధనలు పాటించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీలత ఔషద దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. కోవిడ్‌ మందులు, యాంటి బయోటెక్స్‌, ఇతర మందుల ఎంఆర్‌పి ధరలు, నిలువ, నాణ్యత పరిశీలించారు. అదేవిధంగా అమ్మకం, కొనుగోలు బిల్లులు పరిశీలించారు. ప్రతి మెడికల్‌ షాపు మందుల చట్టం నిబందనలు పాటించాలని, ఎక్స్‌ పయిరి మందులు ఎప్పటికప్పుడు తొలగించాలని, కస్టమర్లకు తప్పనిసరిగా కొనుగోలు బిల్లులు ఇవ్వాలన్నారు. షెడ్యూలు ...

Read More »

అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకతి వనాలు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం పద్మాజివాడి, భూంపల్లి గ్రామ శివారులోని అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కల సంరక్షణలో అలసత్వం వహిస్తే సర్పంచ్‌, కార్యదర్శిలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూంపల్లిలోని అంబరీషుని గుట్టపై ఉన్న పల్లె ప్రకతి వనాన్ని సందర్శించారు. నాటిన మొక్కలకు పాదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంకీ ...

Read More »

మొక్కలు చనిపోతే జరిమానా

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేంపల్లి మరియు నాగంపేట్‌ గ్రామాలలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు హరిత హారంలో నాటిన ఏవిన్యూ ప్లాంటేషన్‌ పరిశీలించగా రైతుల నిర్లక్ష్యం వల్ల మొక్కలపై మొక్కజొన్న బూరు వేయడం వల్ల చనిపోయాయని పరిశీలనలో తెలిసిందని, ఒక్కొక్క మొక్కకు వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించడం జరిగిందని, మొత్తం ఐదు మొక్కలు చనిపోగా, సంబంధిత ఐదుగురు రైతులకు 5 వేలు జరిమానా విధించడం జరిగిందని, భవిష్యత్తులో కూడా ఈ విధంగా మొక్కలకు హాని కలిగించినట్లయితే మొక్కకు ...

Read More »

జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌, రైతు వేదికలు, పల్లె ప్రకతి వనాలు, స్ట్రీట్‌ వెండర్స్‌, నర్సరీలు, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. బుధవారం ఆర్డిఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మా, డిపిఓ, పిఆర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంఆర్‌ పర్‌ఫెక్టుగా ప్లాన్‌ చేయాలని, ప్రతి రైస్‌ మిల్‌ దగ్గర్నుండి రోజుకు రెండు ఏసికె (29 ఎంటిఎస్‌) ల రైస్‌ బయటికి వెళ్లాలని, అలా అయితేనే మనం ...

Read More »

ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ బిల్లును వెంటనే రద్దు చేయాలని, ప్రజలకు పేద మధ్య తరగతి కుటుంబాలకు నడ్డివిరిచే విధంగా ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుమీద వేల కోట్ల రూపాయలు దండుకున్నారని బిజెపి నాయకులు పుప్పాల శివరాజ్‌ కుమార్‌ జీవి నరసింహా రెడ్డి దుయ్యబట్టారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి ఎల్‌ఆర్‌ఎస్‌ ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరు చేయించారు. మోపాల్‌ మండల కేంద్రానికి చెందిన సాయిలుకి 16 వేలు, మోపాల్‌ మండలానికి చెందిన సులోచనకి 60 వేలు, ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రాజా గౌడ్‌కి 46 వేలు చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ధర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ ...

Read More »

రూ. 3 లక్షల విలువ చేసే గుట్కా, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్పెక్టర్‌ షాకేర్‌ అలీ మరియు వారి సిబ్బంది పలువురి ఇళ్ళలో తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్‌ 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో పులాంగ్‌ ఎక్స్‌ రోడ్‌ సమీపంలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఇంట్లో గుట్కా మరియు జర్ధా వుంచారని నమ్మదగిన సమాచారం మేరకు ఇంటిని తనిఖీ చేశారు. కాగా సుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే గుట్కా మరియు ...

Read More »

‘దోస్త్‌’ ప్రక్రియలో అక్రమాలకు తెరలేపిన డిగ్రీ కళాశాలలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమైక్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌, విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దోస్తు అడ్మిషన్ల ప్రక్రియలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు వాటికి అనుబంధంగా ఉన్న ఇంటర్మీడియట్‌ కళాశాలలోని విద్యార్థులను వారికి తెలియకుండానే వారి ఫోన్‌ నెంబర్లు బదులు అధ్యాపకులు మరియు ఇతరుల ఫోన్‌ నెంబర్లతో అడ్మిషన్లను భర్తీ చేయడం జరిగిందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కుంభాల లక్ష్మణ్‌ ...

Read More »

నిజామాబాద్‌లో మరొకరు కారెక్కారు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌కు చెందిన బీజేపీ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ తెరాసలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి చెందిన 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమారాణి, తడ్కల్‌ శ్రీను తెరాస పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు తెలిపారు.

Read More »

ప్రథమ చికిత్సాలయం ప్రారంభం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం యోగి ప్రథమ చికిత్సలయాన్ని దర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ ప్రారంభించారు.. ముందుగా డాక్టర్‌ యుగేందర్‌కి శుభాకాంక్షలు తెలియజేసి, ఆసుపత్రి మరింత అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. మండల కేంద్ర ప్రజలందరికీ ఆరోగ్యపరంగా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డిసిఎంఎస్‌ చైర్మన్‌ సాంబారు మోహన్‌, స్థానిక ఎంపీపీ నల్ల సారిక హనుమంత్‌ రెడ్డి, ఎంపీటీసీ సుజా ఉద్దీన్‌, ధర్పల్లి గ్రామ ఉపసర్పంచ్‌ భారతీ రాణి, పిఎసిఎస్‌ సొసైటీ ...

Read More »

ఉచిత ఆరోగ్య రక్షణ కల్పించాలి

బోధన్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ కార్మిక సంఘాలు బుధవారం దేశ వ్యాప్తంగా అఖిల భారత నిరసన దినాన్ని జరుపాలని ఇచ్చిన పిలుపులో భాగంగా బోధన్‌ ఆర్డీవో కార్యాలయం ముందు ఐఎఫ్‌టియు, ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుధాకర్‌, సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షుడు జే.శంకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సందర్భంగా అందరికీ ఉచిత ఆరోగ్య రక్షణ కల్పించాలని, దేశంలోని ప్రజలందరికీ 6 ...

Read More »

గంగమ్మ తల్లికి పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఊర చెరువు నిండు కుండలా నిండి అలుగు వస్తున్న సందర్భంగా గ్రామ అభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో దర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌, డిసిఎంఎస్‌ చైర్మన్‌ సాంబారు మోహన్‌, స్థానిక ఎంపిపి నల్ల సారిక హనుమంత్‌ రెడ్డి చెరువు సమీపంలో ఉన్న గంగమ్మ గుడిని దర్శించుకొని అనంతరం చెరువులో పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ మాట్లాడుతూ ధర్పల్లి ...

Read More »