Breaking News

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరు చేయించారు.

మోపాల్‌ మండల కేంద్రానికి చెందిన సాయిలుకి 16 వేలు, మోపాల్‌ మండలానికి చెందిన సులోచనకి 60 వేలు, ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రాజా గౌడ్‌కి 46 వేలు చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ధర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు రక్షించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article