Breaking News

గంగమ్మ తల్లికి పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఊర చెరువు నిండు కుండలా నిండి అలుగు వస్తున్న సందర్భంగా గ్రామ అభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో దర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌, డిసిఎంఎస్‌ చైర్మన్‌ సాంబారు మోహన్‌, స్థానిక ఎంపిపి నల్ల సారిక హనుమంత్‌ రెడ్డి చెరువు సమీపంలో ఉన్న గంగమ్మ గుడిని దర్శించుకొని అనంతరం చెరువులో పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ మాట్లాడుతూ ధర్పల్లి ఊర చెరువు నిండడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను మరమ్మతులు చేసి ఎంతో అభివద్ధి చేశామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో మిషన్‌ కాకతీయలో భాగంగా, ధర్పల్లి గ్రామ చెరువుపైన సుమారు 3 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

చెరువు గట్టు పైన మినీ ట్యాంక్‌ బండ్‌ అతి త్వరలోనే నిర్మాణం అవుతుందని, మండల ప్రజలు హైదరాబాద్‌ నగరంలో ఉన్న ట్యాంక్‌ బండ్‌ వాతావరణాన్ని మన గ్రామ ఊర చెరువు పైన ప్రకతి రమణీయత లభిస్తుందని చెప్పారు. చెరువులు నిండితేనే రైతులందరు సంతోషంగా ఉంటారని, రైతులందరు సంతోషంగా ఉంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని ఆశా భావం వ్యక్తం చేశారు.

రాబోవు కాలంలో ధర్పల్లి మండలంలో పంట పొలాలన్నీ పచ్చగా ఉండాలని, పాడిపంటలతో రైతులందరూ ఆనందంగా జీవించాలని బాజిరెడ్డి జగన్‌ ఆకాంక్షించారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article