Breaking News

Daily Archives: September 27, 2020

కాంగ్రెస్‌ నుంచి తెరాసలోకి…

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎల్లారెడ్డి మునిసిపల్‌ 6వ వార్డు కౌన్సిలర్‌ సంగని బాలమణి పోచయ్య కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో పార్టీ మారారు. ఎమ్మెల్యే తెరాస పార్టీ కండువా కప్పి, శాలువాతో సన్మానించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ నియోజక వర్గ అభివద్ధికి ...

Read More »

ధైర్యంగా ఉద్యమించిన నాయకుడు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండ లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. ఆదివారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వయం సహాయక, సహకార ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ...

Read More »

మూగవోని గొంతు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు తిరుమల గోవిందా వనమాల క్షేత్రంలోని పద్మావతి కల్యాణం మండపంలో నిర్వహించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత, మా పల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ భూమిపై గాలి ఉన్నన్ని రోజులు బాలు గొంతు ఉంటుందని, వారు అమరులని అన్నారు. దాదాపు 16 భాషల్లో దాదాపు 40 వేల పాటలు పాడి ప్రతి ఇంటిలో ప్రతి బడిలో ప్రతి గుడిలో బాలు ఒక భాగమై ఉన్నారన్నారు. ...

Read More »

తెరాసలోకి 37వ డివిజన్‌ కార్పొరేటర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌కు చెందిన బీజేపీ 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆదివారం తెరాస కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి చెందిన 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమారాణి, ముత్యాలు తెరాస పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి ...

Read More »

తెరాసలోకి కాంగ్రెస్‌ జడ్పిటిసి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్‌ పార్టీ జడ్పీటీసీ కె.ఉషాగౌడ్‌ ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో ఆదివారం టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి మంత్రి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్‌ఎస్‌లో చేరినట్లు జడ్పీటీసీ ఉషాగౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ...

Read More »

ఎన్నికల నోడల్‌ అధికారులు వీరే…

కామరెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికలలో భాగంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎన్నికల నోడల్‌ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశాలు జారీ చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ జిల్లా సెక్యూరిటీ ప్లాన్‌ నోడల్‌ అధికారిగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌. శ్వేత నియమింపబడ్డారు. మ్యాన్‌ పవర్‌ మేనేజ్మెంట్‌, పోలింగ్‌ సిబ్బంది మైక్రో అబ్జర్వర్లు మొదలగు వాటికి నోడల్‌ అధికారిగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్‌, బ్యాలెట్‌ పేపర్‌, ...

Read More »

కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్బంగా కామరెడ్డి జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, జిల్లా బీసీ అభివద్ధి ఇన్‌చార్జి అధికారి డి.శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ బీసీ అభివ ద్ధి అధికారి యాదగిరి, సూపరింటెండెంట్‌ రేవంత్‌, అధికారులు చక్రధర్‌, ...

Read More »

దోపిడీ వ్యవస్థ నిర్మూలనతోనే కులాల నిర్మూలన

రెంజల్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో సాంఘిక సమానత్వానికై అనేక పోరాటాలు జరిగాయని కాని పాలకులు కులాల నిర్మూలనకు అడ్డుపడుతూ దేశ అభివద్దికి అడ్డు పడుతున్నారని బి.మల్లేష్‌, డి.రాజేశ్వర్‌ అన్నారు. రెంజల్‌ మండలం బోర్గాం గ్రామంలో సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కుల నిర్మూలన సభలో బి.మల్లేష్‌, డి.రాజేశ్వర్‌ మాట్లాడారు. న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహాత్మా జ్యోతి రావ్‌ పూలే సత్య శోధక్‌ సమాజ్‌ సందర్భంగా సెప్టెంబర్‌ 24 నుండి ...

Read More »

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వీరుడు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండ లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా ఆదివారం రామారెడ్డి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ, యువజన సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో రామారెడ్డిలో బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఇసాయిపేట నరేష్‌ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ...

Read More »

దసరాకు ‘ధరణి’

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే దసరా పండుగ రోజున ధరణి పోర్టల్‌ ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి స్వయంగా ధరణి పోర్టల్‌ను అదేరోజు ప్రారంభిస్తారు. ధరణి పోర్టల్‌ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌కు అవసరమైన సాఫ్ట్‌ వేర్‌, హార్డ్‌ వేర్‌, బ్యాండ్‌ విడ్త్‌ లను సిద్ధం చేయాలని చెప్పారు. మారిన రిజిస్ట్రేషన్‌ ...

Read More »