Breaking News

దోపిడీ వ్యవస్థ నిర్మూలనతోనే కులాల నిర్మూలన

బోధన్‌, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత దేశంలో గల దోపిడి వ్యవస్థ నిర్మూలనతోనే దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన జరుగుతుందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం బోధన్‌ మండలం ఖాజాపూర్‌ గ్రామంలో సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల నిర్మూలన సభలో వి.ప్రభాకర్‌ మాట్లాడారు.

అనాదిగా దేశంలో మనువాద బ్రాహ్మణీయ భావజాలం నిచెన మెట్ల కులవ్యవస్థ రూపంలో క్రింది కూలాల పైన, మహిళల పైన జరుపుతున్న వివక్షతను, దాష్టీకాన్ని పూలే చిన్న తనం నుండి చూసి చలించి పోయాడని, దానికి వ్యతిరేకంగా సత్య శోధక్‌ సమాజ్‌ స్థాపించి పోరాడారని, ఆయనే కాక అనేక మంది సంఘ సంస్కర్తలు కూడా అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు.

అయినా దేశంలో కుల నిర్మూలన జరుగలేదని, నేటి పాలకులు ప్రజలను సంఘటిత పరచకుండా కులాలుగా విడదీసీ వాడుకుంటున్నారని దానికి వ్యతిరేకంగా ప్రజలందరు పోరాడాలని పిలుపునిచ్చారు. సభకు బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి మల్లేష్‌ అద్యక్షత వహించారు.

సభలో పార్టీ డివిజన్‌ నాయకులు డి.రాజేశ్వర్‌, ఏఐకెఎంఎస్‌ నాయకులు గుమ్ముల గంగాధర్‌, పడాల శంకర్‌, పీవోడబ్ల్యూ బోధన్‌ అధ్యక్షురాలు బి.నాగమణి, గ్రామ సర్పంచ్‌ చింతం నాగయ్య, సీహెచ్‌.గంగారాం, ఎస్‌.గంగారాం, కొండపల్లి లక్ష్మణ్‌, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article