Breaking News

Daily Archives: September 30, 2020

పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 43 ర్యాపిడ్‌ టెస్టులు చేయగా మాగి షుగర్‌ ఫ్యాక్టరీలో ఇద్దరు, అచ్చంపేట్‌ గ్రామంలో నలుగురికి కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్య అధికారి రాధాకిషన్‌ తెలిపారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్‌ లు ధరించాలన్నారు. లక్షణాలున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి తెలిపారు. నిజాంసాగర్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసులు 238 కరోనాను జయించిన వారు.189 ...

Read More »

సోమవారం నాటికి పోలింగ్‌ స్టేషన్లు సిద్ధం కావాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ కేంద్రాలలో పాల్గొనే పివోలు, ఓపివోలు, ఎస్‌వోఎస్‌ కు శిక్షణ ఇచ్చారు. శిక్షణలో జిల్లా కలెక్టర్‌ మరియు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సి.నారాయణ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. బుధవారం కొత్త అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల శిక్షణ శిబిరానికి హాజరైన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పివోలు ఎన్నికల్లో టీం లీడర్‌ వంటి వారని, ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌, సెక్టోరల్‌ ఆఫీసర్‌ ...

Read More »

తెవివిలో కారుణ్య నియామకం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మొట్ట మొదటి సారిగా కారుణ్య నియామకాన్ని చేపట్టారు. ఉపకులపతి సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి నీతూ కుమారి ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం అవిశ్రాంత కషితో గవర్నమెంట్‌ జీఓలు అన్ని అడాఫ్ట్‌ (అనువర్తింప) చేసుకొని పాలక మండలి (ఎగ్జిక్యూటీవ్‌) సమావేశంలో కారుణ్య నియామకానికి అనుమతి తీసుకొన్నారు. మొట్టమొదటి కారుణ్య నియామక పత్రాన్ని దివంగత ఆచార్యులు బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ చారి సతీమణి శ్రీవాణికి రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ...

Read More »

వాహనదారుల ఇబ్బందులు… పట్టించుకోని అధికారులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని పెద్ద చెరువు పదహారు రోజులుగా అలుగు పొంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఎల్లారెడ్డి- మెదక్‌ ప్రధాన రహదారిపైనుంచి నీరు పారడంతో రోడ్డు గుంతలమయమైంది. రహదారి గుండా వాహనదారులు అలుగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలో పడి వాహనదారులకు గాయాలైన సంఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. రాత్రి వేళల్లో రహదారి గుండా రావడానికి వాహనదారులు జంకుతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చెరువు కట్టపై ...

Read More »

కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా పోరాటం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సత్యశోధక్‌ సమాజ్‌ 148 వ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా ఐఎఫ్‌టియు, ఏఐకెఎంఎస్‌, సిఎస్‌సి, పిడిఎస్‌యు, పివైఎల్‌, పివోడబ్ల్యు సంఘాల ఆధ్వర్యంలో ఎన్‌. ఆర్‌ భవన్‌, కోటగల్లీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం.వెంకన్న మాట్లాడుతూ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేలు దళితులు, నిమ్న కులాలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఇన్నేళ్ళయినా దేశంలో కుల దురహంకార దాడులు మరింత పెరుగుతున్నాయన్నారు. మొన్న ప్రణయ్‌, నిన్న హేమంత్‌ల హత్యలు ...

Read More »

బిజెపి సంబరాలు… వారంతా నిర్దోషులే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాబ్రీ మసీదు కేసులో వారంతా నిర్దోషులని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు పట్ల కామారెడ్డి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సంబరాలు చేసుకోని మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ తెలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు ఎట్టకేలకు తెరపడిందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించడం సంతోషమన్నారు. బాబ్రీ మసీదు ...

Read More »