Breaking News

మీరిచ్చే రక్తదానం…మరొకరికి ప్రాణదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు పేర్కొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్క యువతీ యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ప్రస్తుత తరుణంలో బ్లడ్‌ బ్యాంకులో రక్త నిల్వలు లేకపోవడం వలన ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం దొరకడం లేదని మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చునని పేర్కొన్నారు. సంవత్సరంలో నాలుగు సార్లు చేయవచ్చునని ఈ సందర్భంగా అన్నారు.

గత నాలుగు నెలల కాలంలో 250 యూనిట్ల రక్తాన్ని మరియు 20 మందికి కరోనా బాధితులకు ప్లాస్మా సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడామన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన రక్తదాతలను అభినందించారు. దీనికి సహకరించిన రెడ్‌ క్రాస్‌ జిల్లా కార్యదర్శి రాజన్న, శ్రమశక్తి పార్టీ వ్యవస్థాపకుడు వరద శ్రీనివాస్‌, బ్లడ్‌ బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, టెక్నీషియన్‌ ప్రమోద్‌ పాల్గొన్నారు.

Check Also

నిరుద్యోగుల‌ను నిండా ముంచిన ఘనత కేసీఆర్‌దే

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, ల‌క్షలాది ఉద్యోగాలు ...

Comment on the article