Breaking News

ప్రముఖ వైద్యుడు తాటికొండ భైరయ్య మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ తాటికొండ బైరయ్య మతిపట్ల మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ ఆలీ షబ్బీర్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. డాక్టర్‌ బైరయ్య ఇక లేరన్నవార్త కలచివేసిందని, ఆయన తమ కుటుంబ డాక్టర్‌ అని అతని వద్ద వైద్యం చేయించుకున్న వారు చుట్టుపక్కల పట్టణాల్లో నివసించినా తిరిగి అతని వద్దకు వచ్చి వైద్యం చేయించుకునే వారని గుర్తుచేశారు.

ఆయన డబ్బు ఆశించకుండా వైద్య సేవలు అందించేవారని, పేద ప్రజలకు వైద్యం చేస్తూ వారి హదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. ఆయన పేదల డాక్టర్‌గా పేరు సంపాదించుకున్నారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Check Also

నిరుద్యోగుల‌ను నిండా ముంచిన ఘనత కేసీఆర్‌దే

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, ల‌క్షలాది ఉద్యోగాలు ...

Comment on the article