డిచ్పల్లి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ బి.ఎడ్. అండ్ ఎం.ఎడ్. కళాశాలలో కొవిద్ – 19 మార్గనిర్దేశాలను అనుసరించి ఈ నెల 12 వ తేదీ నుంచి బి.ఎడ్. చివరి (నాల్గవ) సెమిస్టర్ రెగ్యూలర్ మరియు బ్యాక్ లాగ్ పరీక్షలు మరియు ఎం.ఎడ్. మూడవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్, ఇంఫ్రూవ్ మెంట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదే షెడ్యూల్డులో బి.ఎడ్. మొదటి, రెండవ, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను మరియు ఎం.ఎడ్. మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంఫ్రూవ్ మెంట్ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. బి.ఎడ్. చివరి (నాల్గవ) సెమిస్టర్ రెగ్యూలర్ అండ్ బ్యాక్ లాగ్ మరియు మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 12 నుంచి 20 వ తేదీ వరకు, రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21 వరకు, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 13 నుంచి 19 వరకుబీ ఎం.ఎడ్. మూడవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్, ఇంఫ్రూవ్ మెంట్ పరీక్షలు ఈ నెల 12 నుంచి 18 వరకు, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంఫ్రూవ్ మెంట్ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21 వరకు నిర్వహిస్తామని చెప్పి పరీక్షల సమయసారిణి విడుదల చేశారు.
బి.ఎడ్. ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 5 నుంచి 7 వరకు నిర్వహిస్తామని చెప్పారు. బి.ఎడ్. కోర్సులో మొదటి రోజు ఉదయం చివరి (నాల్గవ) సెమిస్టర్ రెగ్యూలర్ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలు మరియు మధ్యాహ్నం మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు, రెండవ రోజు ఉదయం రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు మరియు మధ్యాహ్నం మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలుబీ ఎం.ఎడ్. కోర్సులో మొదటి రోజు ఉదయం మూడవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్, ఇంఫ్రూవ్ మెంట్ పరీక్షలు, రెండవ రోజు మధ్యాహ్నం మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంఫ్రూవ్ మెంట్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
బి.ఎడ్. చివరి (నాల్గవ) సెమిస్టర్ రెగ్యూలర్ అండ్ బ్యాకలాగ్ పరీక్షలు రాసే విద్యార్థులు 1311 మంది, మొదటి సెమిస్టర్ లో 113, రెండవ సెమిస్టర్లో 288, మూడవ సెమిస్టర్లో 248 మంది విద్యార్థులు బ్యాక్ లాగ్ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. బి.ఎడ్. పరీక్షలకు మొత్తం 1960 మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. బి.ఎడ్. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 12 కళాశాలలు స్వయం పరీక్షా కేంద్రాలు కాగా, జీజీ లో మాత్రం మూడు కళాశాలలను కలిపి ఒక్క పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశామన్నారు.
ఎం.ఎడ్. పరీక్షల నిర్వహణ కోసం జీజీ కళాశాలలో పరీక్షాకేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికి సంబంధించి రిజిస్ట్రార్ ఆచార్య నసీం నిర్దేశం ప్రకారం 15 మంది బి.ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులతో గత నెల సెప్టెంబర్, 26 వ తేదీన బి.ఎడ్. అండ్ ఎం.ఎడ్. పరీక్షల నిర్వహణ మీద అవగాహన సమావేశాన్ని జూం ఆఫ్ ద్వారా ఆన్ లైన్ మీటింగ్ నిర్వహించామని చెప్పారు.
ఇందులో కొవిద్ -19 మార్గనిర్దేశాలు మరియు నిబంధనలకు అనుగుణంగా పరీక్షా గదిలోని సీట్ల కేటాయింపులో నిర్ణీత దూరాన్ని పాటించడం, ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడం, థర్మల్ స్క్రీనింగ్ చేయడం, తప్పని సరిగా మాస్క్ ధరించడం, హెల్త్ రిపోర్ట్ సమర్పించడం, పరిసర ప్రదేశాలను శానిటైజేషన్ చేయడం లాంటి జాగ్రతలు తీసుకొనే విధంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కావున బి.ఎడ్. అండ్ ఎం.ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు మరియు విద్యార్థులు విషయాన్ని గమనించవలసిందిగా కోరారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…? - February 25, 2021
- వన్నెల్ (బి)లో పోలీసు కళాజాత - February 25, 2021
- 26లోగా పూర్తి చేయాలి - February 24, 2021