Breaking News

పిఎం మోడీతో జ‌గ‌న్ బేటీ…

  1. – మంత్రి వర్గంలో చోటు

– మోడీతో భేటీకేనా జగన్‌ ఢిల్లీలో పాగా

– ఏ క్షణాన్నైనా కేంద్రంలో అనూహ్య పరిణామాలు

– ఇదే సమయంలో బిజెపి కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు

హైదరాబాద్‌, అక్టోబ‌ర్ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యంత కీలకమైన, ప్రభావ శీలమైన వ్యవసాయ రంగంలో సమూల మార్పుల కొరకు తీసుకువచ్చిన చట్టాలు రాజ్యసభను దాటి, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయమై పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో ప్రభుత్వాల ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆయా రాష్ట్రాలలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ విధ్వంసానికి కూడా పాల్పడ్డారు.

కాగా బిజెపి మిత్రపక్షం, ఎన్‌డిఎ భాగస్వామి అకాలీదళ్‌ పార్టీ మంత్రి హరసింరత్‌ కౌర్‌ అనూహ్యంగా రాజీనామా చేసి మోడిని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, ఇటు ఎన్‌డిఎలో ఉండలేక, అటు బయటకు వెళ్లలేక రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇదిలా ఉండగా అకాలీదళ్‌ నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీ పూరించే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని కుంటుపరిచింది.

రాజధానికి నిధులు లేక, ప్రత్యేక ప్యాకేజీలు లేక, ఆర్థిక ప్యాకేజీలు రాక, రావాల్సిన జిఎస్‌టి డబ్బులు రాక, ఆర్థికంగా, అభివృద్ధి పరంగా కుదేలవుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఈ అవకాశం ఒక వరంలా కనిపిస్తుంది. అయితే ముందే ఈ విషయాన్ని ఊహించిన జగన్‌ వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో వైసిపి మద్దతు పలికి మోడి, అమిత్‌షాల మనసు గెలుచుకొని బేర సారాలకు లైన్‌ క్లియర్‌ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఢిల్లీలో జగన్‌ పాగా వేసి మోడి, అమిత్‌షాలతో చర్చలు జరుపుతున్నట్టుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే ప్యాకేజీలో భాగంగా మంత్రి పదవులు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తికావడానికి అన్ని రకాల సహాయ సహకారాలు, జిఎస్‌టి బకాయిల విడుదల, మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం ఇవే గాకుండా పాపులర్‌ సంక్షేమ పథకాలు వాటికి ఆర్థికంగా కేంద్ర సహాయం ఇచ్చే విధంగా మోడీని కోరినట్టు తెలిసింది.

కాగా మోడీ ప్రభుత్వం ఒక కేంద్ర మంత్రి పదవి, ఒక కేంద్ర సహాయ మంత్రి పదవి, లోక్‌సభ డిప్యూటి స్పీకర్‌ పదవులు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటితోపాటు జగన్‌ కోరిన ప్యాకేజీల పై స్పష్టమైన హామీ ఏమి ఇవ్వలేదని తెలిసింది.

ఈ అనూహ్యమైన మార్పులు ఏ క్షణాన్నైనా జరగవచ్చని, ఎన్‌డిఎ, వైసిపి చట్టా పట్టాలు వేసుకునే సమయం ఆసన్నమైందని ఇరు పార్టీల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

YSR Congress to Join NDA 

 

– A place in the ministerial category

– Jagan to meet Modi in Delhi

– Unexpected consequences at the center of any moment

– Changes in the BJP Union Cabinet at the same time

Nizamabad News Special Correspondent New Delhi : September 30

Nizamabad‌news.in: It is a well-known fact that the most crucial and effective laws recently brought by the BJP government for radical change in the agricultural sector have crossed the Rajya Sabha and been approved by the President. However, in Punjab and Haryana, thousands of crores of rupees have been lost to the state exchequer in the wake of large-scale protests and vandalism.

Meanwhile, BJP ally and NDA ally Akali Dal party minister Harasimrat Kaur’s unexpected resignation has been thwarted by an attempt to harass Modi, making it a bad omen for both to stay in the NDA and not to leave. Meanwhile, it seems that Andhra Pradesh Chief Minister Jagan is making strenuous efforts to fill the vacancy created by the Akali Dal’s departure. The chasm between the Center and the Andhra Pradesh government in the last Telugu government has crippled the development of Andhra Pradesh.

The arrival of funds to the capital, or special packages, or the arrival of financial packages, the arrival of the GST money due, seems like a boon to the Andhra Pradesh government, which is booming economically and in terms of development. However, in anticipation of this, it seems that Modi has cleared the line for bargaining chips by winning the minds of Modi and Amit Shah by backing the YCP in Parliament for the agrarian bills.

The most credible information is that Jagan is in talks with Modi and Amit Shah in Delhi on September 30. However, as part of the package, Modi has sought ministerial posts, funding for a special financial package for Andhra Pradesh, all kinds of assistance for the completion of the Polavaram project, release of GST arrears, assistance for setting up of three capitals and popular welfare schemes to financially centralize them.

According to credible sources, the Modi government is ready to give him the post of Union Minister, Union Assistant Minister and Deputy Speaker of the Lok Sabha. In addition, Jagan did not give any clear assurance on the requested packages.

Sources in both the parties are of the view that these unpredictable changes could happen at any moment and the time has come for the NDA and YCP to legislate.

 
 
 
 
 

Check Also

పట్టణ విద్యార్థులకూ వ్యవసాయ డిప్లొమా సీట్లు

హైదరాబాద్‌, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః వ్య‌వసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిబంధనలను మారుస్తూ ఆచార్య ...

Comment on the article