Breaking News

కోతలు మొదలైనయి.. కొనుగోలెప్పుడు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో రైతులు కష్టపడి పండించిన పంటలు కోతకు వచ్చాయి. ప్రభుత్వం దష్టి సారించి కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కాలయాపన చేయొద్దు అని, దళారులు కొన్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులు నష్టపోతారని, దళారులకే లాభం చేకూరుతుందని రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కూనీపూర్‌ రాజారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎకరానికి సుమారు 28 వేల రూపాయల నుండి 30 వేల వరకు ఖర్చు అవుతుందని, చేతికి వచ్చిన పంటను అమ్ముకోవాలంటే దళారులు 1400 నుండి 1500 రూపాయలలోపే కొనుగోలు చేస్తున్నారని రైతులకు ఈ ధర బయట చెప్పవద్దని చెపుతున్నారన్నారు. రైతులు పండించిన పంటకు ఎంతకు అమ్మినామో చెప్పే పరిస్థితి కూడా లేదని, రైతులు వారు పండించిన పంటను ఈదరకు అమ్మాలంటే కంటికి నీళ్ళు వస్తున్నాయన్నారు.

ఇప్పటికైనా దష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్మే విధంగా కషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళారులతో కుమ్ముక్కైందని దళారులనే ఉసిగొల్పుతూ కాలయాపన చేస్తుందన్నారు. ప్రకటనలు పేపర్‌కే కాదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

దళారులను ఏజంట్లుగా పెట్టుకుని రైతులను మోసం చేస్తున్నారని తక్కువ ధరకు కొనే ఏజంట్లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని లేనియెడల రైతుల తరపున పోరాటం చేస్తామని, రైతులకు అన్ని రకాల న్యాయం జరిగేవరకు కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందని రాజారెడ్డి అన్నారు. 20 నెలలు గడిచినా రుణ మాఫీ చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article