Breaking News

దళారులను నమ్మి మోసపోవద్దు

బీర్కూర్‌, అక్టోబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం కష్టించి పండించిన రైతు తమ పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌, పిఏసిసి మైలారం కమిటీ ఛైర్మన్‌ పెరక శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో అన్నారు.

సిఎం కెసిఆర్‌ కృషితో, అలాగే శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషితో త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను నసురుల్లాబాద్‌ మండలంలో ఏర్పాటు చేస్తున్నామని వాటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్‌ రైతులను కోరారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. తక్కువ ధరకు తమ పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని పెరక శ్రీనివాస్‌ సూచించారు.

Check Also

కిసాన్‌ సమ్మాన్‌ యోజనలో లక్ష 50 వేల మంది కామారెడ్డి రైతులకు లబ్ది

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి ...

Comment on the article