Breaking News

8 నుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళన

నిజామాబాద్‌, అక్టోబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు అనుబంధం) రాష్ట్ర ఆఫీస్‌ బేరర్‌ సమావేశం బుధవారం యూనియన్‌ కార్యాలయం కోటగల్లీలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఐ.ఎఫ్‌.టి.యు జాతీయ ఉపాధ్యక్షులు డి.వి కష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పని చేస్తున్న బీడీ కార్మికులు, టేకేదార్లు, ప్యాకర్స్‌ బట్టివాలా తదితరుల వేతనాలు, కూలీ రేట్లు పెంచాల్సి ఉన్నా, యాజమాన్యాలు స్పందించకపోవడం సరైంది కాదన్నారు.

అదేవిధంగా బీడీ కార్మికులకు సరిపడా పనిదినాలు కల్పించడం, ఆకు, తంబాకు, దారం అందించడంలో కార్మికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కూలీరేట్లు, వేతన ఒప్పందాల పెంపుదల, అమలుకై గురువారం నుండి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామన్నారు. పిలుపును బీడీ పరిశ్రమలోని అన్ని వర్గాల కార్మికులు జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు.

సమావేశంలో ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సూర్యం, బీడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమేశ్వర్‌, రాష్ట్ర కార్యదర్శులు వెంకన్న, ముత్తన్న మరియు రాష్ట్ర నాయకులు రాజేశ్వర్‌, మల్లేష్‌, సత్తెక్క, రాజన్న, సూర్య శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article