Breaking News

కామరెడ్డిలో అపూర్వ స్పందన

కామరెడ్డి, అక్టోబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆస్తుల నమోదు సర్వేకు జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆస్తుల నమోదుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో చేపట్టిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులకు మెరున్‌ పాస్‌ పుస్తకాలు ఇస్తోందని సూచించారు. ప్రతి గ్రామంలో ఆస్తుల నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

మున్సిపాలిటీలో వార్డుల వారీగా బందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లబ్ధిదారులు అందుబాటులో ఉండి వివరాలు సర్వే బందానికి తెలియజేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో 22 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారని చెప్పారు. 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఆర్డీవో శీను నాయక్‌, డిఎల్‌పిఓ శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article