Breaking News

అలసత్వం సహించబోము – జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతీ గ్రామంలో రోజుకు 50 వ్యవసాయేతర ఆస్తులను గుర్తించి ఆన్‌లైన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.

మంగళవారం ఏపీవోలు, డిఎల్పీఓ, ఎపిఓలతో ఏర్పాటు చేసిన సెల్‌ కాన్పరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అప్‌లోడింగ్‌ మందకొడిగా సాగుతుందని, ఇదే విధంగా ఉన్నట్లయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి రోజూ 50 నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీస్‌ గుర్తించి వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ విషయంలో ప్రతిరోజు రివ్యూ తీసుకుంటామని, ఎటువంటి అలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article