కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు స్థానిక సంస్థల నియోజక వర్గ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను కలెక్టరేటు కార్యాయంలో వెబ్ కాస్టింగ్ కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి పాల్గొన్నారు.
Read More »Daily Archives: October 9, 2020
10న విద్యుత్ అంతరాయం
నిజామాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 10వ తేదీ శనివారం నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు మరమ్మతుల కోసం సరఫరా నిలిపివేయడం జరుగుతుందని సంబంధిత అధికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. నగరంలోని బర్కత్‌పుర, అరబ్గల్లి, ఖిల్లా రోడ్డు, అహ్మదీ బజార్, దారుగల్లి, లైన్ గల్లిలలో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.
Read More »కామారెడ్డిలో విషాదం
కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి జిల్లా టెక్రియల్ శివారులోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో శుక్రవారం యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామరెడ్డి పట్టణానికి చెందిన శ్యామ్ అనే యువకుడు మహాలక్ష్మి ఆటోమొబైల్స్‌లో సెల్స్ మెన్‌గా పనిచేస్తునాడు. మతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెరువులో దూకి ఎంధుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.
Read More »ప్రపంచ సదస్సుకు డా.త్రివేణి
డిచ్పల్లి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వి. త్రివేణికి 7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ప్రసంగించడానికి ఆహ్వానం లభించింది. ఈ నెల 10, 11 తేదీలలో దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్స్ బర్గ్ కేంద్రంగా అంతర్జాల వేదిక మీద సదస్సు జరుగనుంది. సదస్సుకు ఉపరాష్ట్రపతి ముప్పరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న సదస్సులో డా. వి. త్రివేణి ”దాస సాహిత్యం – సమాంతర భారతీయ భక్తి ఉద్యమాలు” అనే అంశంపై ...
Read More »ఉద్యమ సమయంలో అండగా నిలిచారు
హైదరాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా పాశ్వాన్‌కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పాశ్వాన్ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »