Breaking News

చాలా రోజుల తర్వాత స్వామి వారి దర్శనం

భీమ్‌గల్‌, అక్టోబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నింబచాల క్షేత్రం 10 వతేదీ శనివారం ఉదయం 9 గంటలకి పున: ప్రారంభం అయింది. చాలా రోజుల తర్వాత దేవస్థానం తెరుచుకోవటంతో భక్తుల తాకిడి పేరుగనుంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు.

9 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్థానం వారు సానిటైజర్‌ మరియు సామాజిక దూరం పాటించాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో అన్నసత్రం కూడా ప్రారంభిస్తారని వారు పేర్కొన్నారు.

Check Also

లింబాద్రి ల‌క్ష్మీనర్సింహస్వామి ఆల‌యం తరఫున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ ...

Comment on the article