కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 13 లోగా గ్రామాలలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మండల అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా డివిజనల్ పంచాయతీ, మండల అభివద్ధి, మండల పంచాయతీ అధికారులతో గ్రామ పంచాయితీలలో నిర్వహిస్తున్న వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని సమీక్షిస్తూ, ఈ నెల 13 లోగా పూర్తి చేయాలని, వంద శాతం నమోదు పూర్తి చేసిన సిబ్బంది పూర్తి కాని ...
Read More »Daily Archives: October 11, 2020
ప్లాస్మాదానం అభినందనీయం
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లికి చెందిన శ్రీనివాస్ 50 సంవత్సరాల కరోనా పేషెంట్‌కి బి పాజిటివ్ ప్లాస్మా కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి జలిగామ సూర్య మోహన్ మానవతా దక్పథంతో బి పాజిటివ్ ప్లాస్మాను ప్రతిభ వైద్యశాల నిజామాబాద్‌లో అందజేసి ప్రాణాలు కాపాడడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా కావాలంటే 9492874006 ...
Read More »డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్
డిచ్పల్లి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ కోర్సులకు చెందిన బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ (ఎల్) చివరి (ఆరవ) సెమిస్టర్ పరీక్షలు ఆదివారం కూడా ప్రశాంతంగా జరిగాయని పరీక్షల నియంత్రణాధికారి డా.పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు జరిగిన చివరి (ఆరవ) సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 6864 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 6329 హాజరు, 545 గైరాజరు అయినట్లుగా ఆయన ...
Read More »అమ్మాయిలను వివక్షతతో చూడరాదు
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమ్మాయిలను వివక్షతతో చూడరాదని అడిషనల్ కలెక్టర్ బి.లత అన్నారు. ఆదివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వాలు అమ్మాయిల ఎదుగుదల కొరకు, చదువు కొరకు, అన్ని రంగాల్లో రాణించడానికి కషి చేస్తున్నాయని, అమ్మాయిలకు వారి తల్లిదండ్రులు అన్ని విధాలుగా తోడ్పాటు అందించాలని సూచించారు. అమ్మాయిలను వివక్షతతో చూడకూడదని, అబ్బాయిలకు అమ్మాయిలకు సమాన ...
Read More »యాసంగి పంటల ప్రణాళిక
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి 2021 కాలం వ్యవసాయ పంటల ప్రణాళిక సంబంధించి వ్యవసాయ కార్డు రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆదివారం తన చాంబర్లో వ్యవసాయ శాఖ అధికారులతో యాసంగి 2021 కాలం పంటల ప్రణాళికపై సమీక్షించారు. రైతులు ఏ పంట వేసుకోవాలి, పంట మార్చుకోవాలి అనే విషయాలపై చైతన్యపరచాలని, ప్రభుత్వ ఉద్దేశ్యాలు, తద్వారా రైతులకు ఒనగూరే లాభాలను, అందుకు వేసే పంటల వివరాలను రైతులకు క్షేత్ర స్థాయిలో తెలియపరచండన్నారు. ...
Read More »స్క్రూటినీ జాగ్రత్తగా చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌లో పాల్గొనే అధికారుల శిక్షణలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి నారాయణ రెడ్డి. ఆదివారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై పలు సూచనలు చేశారు. స్క్రూటినీ జాగ్రత్తగా చేయాలని, కౌంటింగ్ సూపర్వైజర్లు ఎన్నికల సంఘం జారీచేసిన నియమనిబంధనల విషయంలో క్లారిటీతో ఉండాలని, ...
Read More »