Breaking News

Daily Archives: October 12, 2020

29 ఫిర్యాదులు

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో సోమవారం జరిగిన ప్రజావాణి ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో మొత్తం 29 ఫిర్యాదులందినట్టు అధికారులు తెలిపారు. కాగా రెవెన్యూ శాఖ 9, జిల్లా పంచాయితీ ఆఫీసు 9, మున్సిపల్‌ శాఖ 3, జిల్లా గ్రామీణాభివద్ధి శాఖ 3, విద్యుత్‌ శాఖ, మైనింగ్‌ శాఖ, పౌర సరఫరాలు, బిసి సంక్షేమ శాఖ జిల్లా లీడ్‌ మేనేజరు ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, జిల్లా కలెక్టరేటు పరిపాలన అధికారి ...

Read More »

స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఎల్‌సి కవిత

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్‌ అధికారిక నివాసంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపులో కవిత ఎంఎల్‌సిగా విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన కవితని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. తమ నివాసానికి విచ్చేసిన ఎంఎల్‌సి కవితని పోచారం కుటుంబ సభ్యులు శాలువాతో సత్కరించారు. జహీరాబాద్‌ ఎంపీ బిబీ ...

Read More »

13న విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతిలో భాగంగా నిజామాబాద్‌ పట్టణంలో 13వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని సంబంధిత అదికారి ఎం.అశోక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని యాదగిరి బాగ్‌, హనుమాన్‌ నగర్‌, కోటగల్లి, బడాబజార్‌, రాజరాజేంద్ర థియేటర్‌ చౌరస్తా, శివాజీనగర్‌, వర్నిరోడ్డులో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

Read More »

బి.ఇడి. పరీక్షా కేంద్రం తనిఖీ

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కర్షక్‌ బి.ఇడి. కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పాత నాగరాజు సోమవారం తనిఖీ చేశారు. సోమవారం నుంచి బి.ఇడి రాత పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలు, యూనివర్సిటీ నిబందనలకు అనుగుణంగా కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రషీద్‌ వివరించగా సివోఇ అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగతా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

Read More »

50 శాతం వేతనాలు పెంచాలి

వర్ని, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బీడీ కంపనిలలో పని చేస్తున్న బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, చాటర్స్‌, నెలసరి ఉద్యోగులకు, బట్టీ వాలాలకు 50 శాతం వేతనాలు పెంచి ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం చందూర్‌ మండల కేంద్రంలో సాబ్లే వాఘ్రే బీడీ సెంటర్‌లో తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సెంటర్‌ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి ...

Read More »

గెలుపు అభివృద్దికి మలుపు

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి పట్టణలోని తెరాస యువజన విభాగం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆదేశాల మేరకు మిఠాయిలు పంచి సంబరాలు జరిపారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కల్వకుంట్ల కవిత భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించిన సందర్భంగా యువజన విభాగం పట్టణ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సదర్భంగా యువజన విభాగం పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ నాయకత్వంలో ...

Read More »

మోదీకి కృతజ్ఞత లేఖలు

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ లింగాపూర్‌ శాఖ ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ చట్టంపై రైతులకు కరపత్రాలు పంపిణీ చేసి, అవగాహన కల్పించారు. దీంతో రైతులు ప్రధాని మోదీకి కతజ్ఞతలు తెలియచేస్తూ స్వచ్చందంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖలు రాశారు. ఈ సందర్భంగా 11 వ వార్డు కౌన్సిలర్‌ కాసర్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను ప్రవేశ పెట్టిందని పండిన పంట దేశంలో ఎక్కడైనా తనకు నచ్చిన ధరకు ...

Read More »

అందరూ అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే చర్యలు తీసుకుంటున్నట్లు పాత భవనాల యజమానులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఎడతెరిపి లేకుండా ...

Read More »

ఘన విజయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. సోమవారం స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపుతో పూర్తయింది. మొత్తం ఓట్లు 824, కాగా పోలైన ఓట్లు 823. అయితే టిఆర్‌ఎస్‌ 728, బీజేపీ 56, కాంగ్రెస్‌ 29, చెల్లని ఓట్లు 10 గా ఎన్నికల అధికారులు వివరాలు వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ...

Read More »

ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

బీర్కూర్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగబోతున్న దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవ ఎన్నికలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌ అన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో 2014, ఆ తరువాత రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామిని నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ భతి 3016 ...

Read More »