Breaking News

దసరా కంటే ముందే పూర్తిచేయాలి

నందిపేట్‌, అక్టోబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం డొంకేశ్వర్‌ గ్రామం రైతు వేదికలను దసరా కన్నా ముందే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్‌ పర్యటనలో భాగంగా ఆకస్మికంగా నందిపేట మండలం, డొంకేఫశ్వర్‌ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికను సందర్శించారు. దసరా కన్నా ముందే పూర్తిచేయాలని పంచాయతీ రాజ్‌ సహాయ ఇంజినీర్‌ను ఆదేశించారు.

జిల్లాలో మొత్తం 106 రైతు వేదికలకు గాను 70 రైతు వేదికలు పూర్తి అయినాయని, మిగతావి వారంలో పూర్తవుతాయన్నారు. పనిలో వేగం పెంచాలని, దసరా లోపు పూర్తి కాకుంటే చర్యలు తప్పవని, ప్రాపర్‌గా ప్లాన్‌ చేసుకోవాలని ఆదేశించారు.

పంచాయతీ సెక్రెటరీ హౌస్‌ సర్వే పూర్తిచేయాలని అన్నారు. ఇప్పటిదాకా 1027 ఇండ్లు పూర్తి చేశామని మిగిలిన 425 కూడా త్వరలో పూర్తి చేస్తామని పంచాయతీ సెక్రెటరీ జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఛాయ, ఎంపీడీవో నాగవరం, తహసిల్దార్‌ అనిల్‌, పంచాయతీ రాజ్‌ డిఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article