Breaking News

Daily Archives: October 14, 2020

చిన్న నీటి వనరులను పర్యవేక్షించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని చిన్న నీటి వనరులను నిత్యం పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని చెరువుల కట్టలు, తూములు, అలుగులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. లీకేజీలు ఉంటే మరమ్మతులు చేపట్టాలని కోరారు. ప్రాజెక్టుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో 900 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని పేర్కొన్నారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ఉన్నవారిని ప్రభుత్వ పాఠశాలలో ఆవాస ...

Read More »

నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం…

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంట, ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. నాగిరెడ్డిపేట మండలం మాటూరు, ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామాల్లోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నిజాంసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు. పంట నష్టం జరిగిన వివరాలు గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరిస్తారని చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ల వివరాలను రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని కోరారు. 2016లో సింగూరు ...

Read More »

అండగా ఉంటాం…

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన హైదరాబాద్‌లోని రామంతాపూర్‌, హబ్సిగూడ పరిసర ప్రాంతాలను మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి పరిశీలించారు. వరదల్లో చిక్కుకున్న హబ్సిగూడా, రామంతా పూర్‌ పరిసర ప్రజలకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్‌. సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని స్థానిక కార్పొరేటర్‌, మరియు ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డిలకు మంత్రి ...

Read More »

స్పందించకపోవడం సరికాదు…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని వివిద బీడీ కంపనీలలో బీడీలు చేసే కార్మికులతో పాటు ప్యాకర్లకు, చాటర్స్‌, నౌకర్‌ స్టాఫ్‌, గంపావాల, నెలసరి ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఇతర సమస్యల పరిష్కారానికై ఎడపల్లి మండల కేంద్రంలో గల కోమ్డాచాఫ్‌ బీడీ సెంటర్‌ ముందు తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో బీడీ కార్మికులు, ఉద్యోగులు, ప్యాకర్స్‌, బట్టీ వాలాలతో ధర్నా నిర్వహించి, మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా యూనియన్‌ జిల్లా ...

Read More »

లేబర్‌ ఎక్కువ పెట్టి పని త్వరగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మెట్టు, గొట్టు ముక్కల మరియు మాక్లూర్‌ గ్రామాలను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ వివిధ గ్రామాలలో రైతు వేదికల నిర్మాణ పనులు, పల్లె పకతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు వేదికలు అక్టోబర్‌ 20వ తేదీ నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగం పెంచాలన్నారు. 20 వరకు పూర్తి కాకుంటే సంబంధిత పంచాయతీ ...

Read More »