Breaking News

లేబర్‌ ఎక్కువ పెట్టి పని త్వరగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మెట్టు, గొట్టు ముక్కల మరియు మాక్లూర్‌ గ్రామాలను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ వివిధ గ్రామాలలో రైతు వేదికల నిర్మాణ పనులు, పల్లె పకతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు వేదికలు అక్టోబర్‌ 20వ తేదీ నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.

పనుల వేగం పెంచాలన్నారు. 20 వరకు పూర్తి కాకుంటే సంబంధిత పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. రైతు వేదికల పనులు రోజువారీగా ప్లాన్‌ ప్రకారం చేయాలన్నారు. ప్రతిరోజు తహసిల్దార్‌ మానిటర్‌ చేయాలన్నారు. దసరాకు రైతు వేదికలు ప్రారంభించుకోవాలన్నారు.

మాక్లూర్‌ రైతు వేదిక పనులను పరిశీలించారు. లేబర్‌ ఎక్కువ పెట్టి పని త్వరగా పూర్తి చేయాలన్నారు. మాక్లూర్‌లో పల్లె ప్రకతి పార్కు స్థలం చాలా బాగుందన్నారు. కలెక్టర్‌ వెంట నిజామాబాద్‌ ఆర్డిఓ రవి, సర్పంచ్‌ గంగాధర్‌, ఆంధ్రనగర్‌ సర్పంచ్‌ రామారావు, మాక్లూర్‌ తహసిల్దార్‌ ఆంజనేయులు, ఎంపీడీవో షాక్రియా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article