Breaking News

9 వరద గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు రిజర్వాయర్‌ 1,2,3,4,6,7,8,9,10, వరద గేట్ల ద్వారా గురువారం మధ్యాహ్నం 1 గంటలకు నీటిని విడుదల చేశారు. గోదావరి బేసిన్‌ కమిషనర్‌ మధుసూదన్‌ రావు నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తి 64 వేల క్యూసెక్కుల నీటిని దిగువ మంజీర ద్వారా గోదావరిలోకి విడుదల చేశారు.

గేట్లను ఎత్తివేయడానికి ముందు గోదావరి బేసిన్‌ కమిషనర్‌ మధుసూదన్‌ రావుతో పాటు ఎస్‌ఈ మురళీధర్‌, ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గేట్లను ఎత్తి నీటిని వదిలారు. గేట్లను వదల కంటే ముందు ప్రాజెక్టుపై ఉన్న సైరన్‌ను దాదాపు గంటపాటు మోగించి, మంజీర పరివాహక ప్రాంతం వైపు ఎవరు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. నీటిని విడుదల చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న నిజాంసాగర్‌ ఎస్‌ఐ మొహమ్మద్‌ హైమద్‌ సిబ్బందితో కలసి ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ జలాశయం పూర్తి స్థాయిలో నిండటంతో ప్రాజెక్ట్‌లో 17.802 టీఎంసీల నీరు నిల్వ ఉంచుతూ అదనంగా వస్తున్న నీటిని వదిలి పెడుతున్నారు. ఎగువ ప్రాజెక్ట్‌ అయిన సంగారెడ్డి జిల్లా సింగూర్‌ ప్రాజెక్ట్‌ జలాశయం నుండి 28 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లోను సింగూర్‌ ప్రాజెక్ట్‌ 14,15, గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం గోదావరి బేసిన్‌ మధుసూదన్‌ రావు మాట్లాడుతూ ఎగువ ప్రాంతమైన సింగూర్‌, హల్ది వాగు నల్లవాగు ద్వారా లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నిజాంసాగర్‌ 10 వరద గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కుల దిగువలోకి విడుదల చేయడం జరుగుతుందన్నారు.

2016లో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారిందని నాలుగు సంవత్సరాల తర్వాత నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉండడంతో ఆనందంగా ఉందన్నారు. అదనంగా వస్తున్న ఇన్‌ ఫ్లో ను చూసి గేట్లను ఎత్తివేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఎస్‌ఈ మురళీధర్‌, బోధన్‌ నీటిపారుదల శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి, ఏఈ శివకుమార్‌, భాసిద్‌ తదితరులు ఉన్నారు.

Check Also

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం ...

Comment on the article