Breaking News

రైతులు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం…

బాన్సువాడ, అక్టోబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు క్షేమంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలో శుక్రవారం కొనుగోలు కేంద్రాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై స్పీకర్‌ మాట్లాడారు. వానకాలంలో రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కేంద్రాల్లో పాటించవలసిన జాగ్రత్తలను వివరించారు. జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సూచించారు.

ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ పాటిల్‌, జిల్లా వ్యవసాయ అధికారిని సునీత, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, సహకార సంఘాల చైర్మన్లు, మార్కెట్‌ కమిటీ అధికారులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article