కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పోర్టల్ సేవలు ప్రజలకు పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కామరెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి తహసిల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 25న దసరా పండుగ రోజున ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారని చెప్పారు. ఆస్తులకి పూర్తి భద్రత ఉంటుందని సూచించారు. తహసిల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తారని ...
Read More »Daily Archives: October 18, 2020
రైతులను లాభాల బాటలోకి తెప్పించాలి
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా రైతులను లాభాల బాటలో తెప్పించేందుకు డిసిసిబి బ్యాంకు ద్వారా కషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిసిసిబి బ్యాంకు అంతస్తులో చైర్మన్ చాంబర్‌ను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకుకు రాష్ట్రంలోనే ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఆ చరిత్రను నిలుపుకునే బాధ్యత ప్రతి ...
Read More »బాధిత కుటుంబానికి కార్పొరేటర్ సాయం
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 49వ డివిజన్లో తులసి వెంకటస్వామి ఇల్లు శనివారం అర్ధరాత్రి విద్యుత్ షాట్సర్క్యూట్కు గురైంది. దీంతో మంటలు ఇల్లంతా వ్యాపించి ఇంటిలోని నిత్యవసర సామాగ్రి, ఫర్నీచర్, ఇతరత్రా వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న 49వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు విజయ్ రూ. 20 వేలు తక్షణమే ఆర్థిక సహాయంగా అందజేశారు. అర్ధరాత్రి కుటుంబసభ్యులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో విద్యుత్ షాట్ సర్క్యూట్ కావడం, మంటలతో వస్తువులు కాలిపోవడం విచారకరమని విజయ్ ఆవేదన వ్యక్తం ...
Read More »వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించిందని రైతు లందరు వాటికి వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు బి.మల్లేష్ పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రైతులందరు వ్యతిరేకిస్తున్నా, మోడీ పట్టుబట్టి బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆర్డినెన్సులను పార్లమెంట్లో బిల్లులుగా ఆమోదింప జేశారని, చట్టాలు ...
Read More »మహిళకు రక్తదానం
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపెట్ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గ్యార బోయిన సుశీల (28) అనే మహిళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన సురేష్ మరియు లింగంపేట్ మండలానికి చెందిన మెట్రో టీవీ విలేకరి గోపాల్ సహకారంతో వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఓ పాజిటివ్ రక్తం అందించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా ...
Read More »