Breaking News

మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే

హైదరాబాద్‌ ప్రతినిధి, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాతో భారత్‌ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. కరోనా కట్టడే లక్ష్యంగా విధించిన జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగాల్లో ఇది ఏడోది.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కరోనా టెస్టింగ్‌ కోసం 2 వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రతి 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకిందన్నారు. అదే అమెరికా, బ్రెజిల్‌ లాంటి దేశాల్లో అయితే 10 లక్షల మందిలో 25 వేల మందికి సోకిందని పేర్కొన్నారు. పండుగల సీజన్‌ సమీపిస్తున్న వేళ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోదీ కీలక సూచనలు చేశారు.

త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుందని, పరీక్షల సంఖ్య పెంచడంలో వైద్య వ్యవస్థ అత్యంత వేగంగా పనిచేసిందన్నారు. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేశారని, కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు.

కరోనా దేశం నుంచి విడిచిపోయిందనే భావన రానీయొద్దని, కరోనా తగ్గిందని భావిస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. కరోనా పోయిందని మాస్కులు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టేనని, యూరప్‌, అమెరికా పరిణామాలు చూస్తే నిర్లక్ష్యం కూడా ప్రమాదకరంగా మారొచ్చన్నారు.

Check Also

నిజామాబాద్‌కు పొంచి ఉన్న ప్రమాదం

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిడతల‌ దండు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన నిజామాబాద్‌, నిర్మల్‌, ...

Comment on the article