Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలంలోని ఇంద్రానగర్‌ గ్రామంలో ఐకెపి సంస్థ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు నష్టం కలగవద్దనే ఉదేశ్యంతో ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి 1882, కామన్‌ గ్రేడ్‌ వరి ధాన్యానికి 1868-00 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నదని, రైతులందరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు, మైనార్టీ కోఆప్షన్‌ సభ్యులు తదితరులు ఉన్నారు.

Check Also

కోనసీమను తలదన్నే విధంగా తెలంగాణలో నాట్లు

ఆర్మూర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోనసీమను తలదన్నే విధంగా తెలంగాణలో నాట్లు పడుతున్నాయని రాష్ట్ర ...

Comment on the article