Breaking News

Daily Archives: October 21, 2020

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న దసరా ఉత్సవాలను రద్దు చేయడం జరిగిందని పట్టణ సర్పంచ్‌ తునికి వేణు బుధవారం తెలిపారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్‌ మాట్లాడారు. కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నందున రావణ దహనం కార్యక్రమంతో పాటు అలాయి బలాయి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ...

Read More »

నిబంధనలు పాటించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో టెలీ కాన్ఫరెన్సులో అధికారులతో మాట్లాడారు. తహసిల్దార్‌ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌ను ఈ నెల 25 న ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి తహసీల్దార్‌, ఉప తహసీల్దార్‌ 10 చొప్పున మాదిరి రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించారు. పకడ్బందీగా ధరణి ...

Read More »

భారీగా గుట్కా స్వాధీనం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు భారీ మొత్తంలో గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 11.50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బర్కత్‌ పురా కాలనీ లో గల ఒక ఇల్లు, గోదాములో గుట్క, జర్ధా ఉన్నదన్న సమాచారం మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలీ తన సిబ్బందితో కలిసి ...

Read More »

ట్రిపుల్‌ ఐటీకి మోడల్‌ విద్యార్థులు ఎంపిక

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేట మోడల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థిని షకీనా బాసర ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైనట్లు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌ విద్యార్థి కె.వినీల్‌ కుమార్‌ ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ సాయిబాబా తెలిపారు. జిల్లాలోని బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామంలో గల తెలంగాణ మోడల్‌ స్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థులు బాసర త్రిబుల్‌ ఐటీకి ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ రాజారెడ్డి తెలిపారు. ...

Read More »

వాహనాల తనిఖీ

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల పరిధిలో గల టోల్‌ గేట్‌ వద్ద అధిక లోడుతో వెళుతున్న వాహనాలను మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ సింగం శ్రీనివాసరావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాలకు ఆయన జరిమానాలు విధించారు. రోడ్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. అధిక లోడుతో వెళితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఫిట్‌నెస్‌ లేకుండా వాహనాలు ఎవరు నడప వద్దని ...

Read More »

మందుబాబును తట్టిలేపిన గోవు

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జొక్కల్‌ మండల కేంద్రంలో బుధవారం ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోగా అటుగా వెళ్తున్న ఆవు వచ్చి అతన్ని తట్టిలేపే ప్రయత్నం చేసింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి లేచే వరకు గోవు ప్రయత్నం చేసింది. చివరికి సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మూగ జీవి వచ్చి అతన్ని లేపడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

Read More »

యువకుని రక్తదానం

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన అమ్ము 33 సంవత్సరాల వయసు కలిగిన మహిళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్త హీనతతో బాధపడుతుండగా వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కామారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన నగేష్‌ సహకారంతో ఓ పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. గత నాలుగు నెలల కాలంలోనే 300 యూనిట్ల ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 40 మందికి 40 లక్షల 5 వేల రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 వేల 942 మందికి 29 కోట్ల 6 లక్షల 10 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లను మగ పిల్లావానితో సమానంగా పెంచాలన్నారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, పేదింటి ...

Read More »