Breaking News

భారీగా గుట్కా స్వాధీనం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు భారీ మొత్తంలో గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 11.50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలోని 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బర్కత్‌ పురా కాలనీ లో గల ఒక ఇల్లు, గోదాములో గుట్క, జర్ధా ఉన్నదన్న సమాచారం మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలీ తన సిబ్బందితో కలిసి ఇంటిని తనిఖీ చేయగా సుమారు 11.50 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా, జర్ధా లభ్యమైందన్నారు. ఈ మేరకు ఎన్‌ఆర్‌ఐ జావిద్‌ (45) అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని 2వ టౌన్‌ పోలీసులకు అప్పజెప్పారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article