Breaking News

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న దసరా ఉత్సవాలను రద్దు చేయడం జరిగిందని పట్టణ సర్పంచ్‌ తునికి వేణు బుధవారం తెలిపారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్‌ మాట్లాడారు. కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నందున రావణ దహనం కార్యక్రమంతో పాటు అలాయి బలాయి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని తెలిపారు.

పట్టణ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దసరా ఉత్సవాలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, పెద్ద బతుకమ్మ ఉత్సవాలు మాత్రం మహిళలు దూరంగా ఉండి జరుపుకోవాలని వేణు సూచించారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు నరసింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, నరేష్‌, శ్రీనివాస్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి భిక్కనూరు మండలం బస్వాపూర్‌ ...

Comment on the article